Sukumar: తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన సుకుమార్ తను మొదట చేసిన ఆర్య సినిమా నుంచి మొన్న చేసిన పుష్ప సినిమా వరకు అన్ని సినిమాలు కూడా వైవిధ్యంగా ఉండటమే కాకుండా ప్రేక్షకుడికి నచ్చే విధంగా ఒక సినిమాని తెరకెక్కించడంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్తాడు. ఇక ఇలాంటి క్రమం లోనే సుకుమార్ కు లెక్కల మాస్టర్ అనే పేరు కూడా ఉంది.
ఎందుకంటే ప్రతి సినిమాలో ఉన్న ప్రతి సీన్ ని లాజిక్ ని చాలా బాగా చూపిస్తూ ఏమాత్రం ఒక్క చిన్న లాజిక్ కూడా మిస్ అవ్వకుండా చూసుకుంటూ కథలో గాని కథనంలో గాని ఏమాత్రం మిస్టేక్ లేకుండా సక్సెస్ కొట్టడంలో సుకుమార్ ఒక బ్రాండ్ అనే చెప్పాలి…ఇక ప్రస్తుతం ఆయన పుష్ప 2 సినిమా బిజీ లో ఉన్నాడు. ఈ సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినప్పటికీ ఇంకొంచెం బ్యాలెన్స్ వర్క్ ని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. అయితే ఈ సినిమా ఆగస్టు లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టుగా కూడా ఇంతకుముందే సినిమా యూనిట్ అనౌన్స్ చేసింది. అయితే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్ అందరిని ఆకట్టుకోవడమే కాకుండా అందులో రిలీజ్ చేసిన డైలాగ్ కూడా ప్రేక్షకులకి విపరీతంగా నచ్చేసింది.
ఇక ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమాతో ఇండియాలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేయాలనే ఉద్దేశ్యం లో సుకుమార్ అయితే ఉన్నాడు. ఇక ఈ సినిమా తర్వాత తను ఎవరితో సినిమా చేస్తాడు అంటూ చాలా రకాల చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇక ఇప్పటికే సుకుమార్ తన రాసుకున్న ఒక మల్టీ స్టారర్ సినిమా కోసం కొంతమంది హీరోలను సంప్రదించినట్టు గా తెలుస్తుంది. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని తమిళ్ ఇండస్ట్రీ కి చెందిన సూర్య, కార్తీలను పెట్టి మల్టీ స్టారర్ సినిమాగా తెరకెక్కించాలని సుకుమార్ ఆలోచిస్తున్నట్టు గా తెలుస్తుంది.
అయితే ఈ సినిమాలో చాలా డెప్త్ ఉందని దానివల్లే ఈ స్టోరీ ని బాగా హ్యాండిల్ చేసే హీరోలు కావాలని సుకుమార్ చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడున్న స్టార్ హీరోలు అందరూ వాళ్ళ వాళ్ళ సినిమాల్లో బిజీ గా ఉండి రెండు మూడు సంవత్సరాల వరకు ఖాళీ లేకపోవడం తో అంతసేపు వెయిట్ చేసే ఓపిక లేని సుకుమార్ సూర్య కార్తీ లకు సరిపోయే విధంగా స్టోరీ లో మార్పులు చేర్పులు చేసి వాళ్ళకి ఇంతకుముందు కథ వినిపించినట్లు సమాచారం అయితే అందుతుంది. మరి ఇద్దరు బ్రదర్స్ తో తీయబోతున్న ఈ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధిస్తుందో చూడాలి…