Sukumar: టాలీవుడ్ లో డైనమిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు సుకుమార్. ఈ సినిమాలు మిగతా వాటికంటే భిన్నంగా ఉండడంతో పాటు బ్లాక్ బస్టర్ గా నిలుస్తాయి. దాదాపు స్టార్ హీరోలంతా సుకుమార్ సినిమాలు చేశారు. మరికొందరు ఈయన సినిమాల్లో నటించాలని ఆసక్తి చూపుతుంటారు. ఇప్పటివరకు సుకుమార్ తీసిన సినిమాల్లో బంపర్ హిట్టు కొట్టినవే ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా పర్సనల్ స్టోరీ ఆధారంగా సినిమా తీస్తుండడంతో సుకుమార్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ తో కలిసి ‘పుష్ప 2’ తో బిజీగా ఉన్నాడు. ఈ తరుణంలో ఆయన గురించి ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ చర్చనీయాంశమవుతోంది.
సుకుమార్ కు తెలుగు ఇండస్ట్రీలో ఓ హీరో అంటే చాలా ఇష్టమట. ఆ హీరో మూలంగానే సుకుమార్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినట్లు కొన్ని సందర్బాల్లో సుక్కు తన అంర్గతాన్ని వెల్లడించాడు. అయితే ఆ హీరోతో కూడా సుకుమార్ ఓ సినిమాను తీశాడు. కానీ ఆ సినిమా అనుకున్న విధంగా సక్సెస్ కాకపోగా తన కెరీర్ లోనే బిగ్గెస్టు డిజాస్టర్ గా నిలిచింది. అయినా సుకుమార్ ఆ హీరో సలహాలు, సూచనలు పాటిస్తూ ఉంటారు. అంతెందుకు సుకుమార్ తీస్తున్న పుష్ప సినిమాలో హీరోగా అల్లు అర్జున్ ను తీసుకోవాలని ఆ హీరోనే సలహా ఇచ్చాడట. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా..?
ఆయనే సూపర్ స్టార్ మహేష్ బాబు. చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు దశాబ్దాలుగా స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. అంతేకాకుండా గత రెండు, మూడేళ్లుగా వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. కేవలం లవ్ యాంగిల్ లోనే కాకుండా సోషల్ రెస్పాన్స్ సినిమాలు తీస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మహేష్ బాబు గురించి సుకుమార్ చెప్పడం ఆసక్తిగా మారింది.
సుకుమార్ సినిమాల్లోకి రాకముందు నుంచే మహేష్ అంటే పిచ్చి ప్రేమ ఉండేదట. అందుకే తాను సొంతంగా రాసుకున్న కథతో మహేష్ తో ‘నేనొక్కడినే’ సినిమా తీశాడు. అయితే ఈ సినిమా జనాల్లోకి పెద్దగా వెళ్లలేదు. అయినా మహేష్ తో కలిసి నిత్యం ఫ్రెండ్లీగా ఉంటారట. సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఏ విషయాన్నైనా సుకుమార్ మహేష్ బాబును సంప్రదిస్తారని టాక్.