Sukumar and Ram Charan : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక నట వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన హీరోలు సైతం వాళ్ళ స్టార్ డమ్ ను విస్తరించుకుంటూ సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు… మరి ఇలాంటి సందర్భంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హీరో భారీ గుర్తింపును సంపాదించుకుంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న వాళ్లు మాత్రమే చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పాలి…
Also Read : రామ్ చరణ్ సినిమాకి బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్ సుకుమార్..షాక్ లో ఫ్యాన్స్..కారణం ఏమిటంటే!
మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ చాలా తక్కువ సమయంలోనే స్టార్ గా పేరు సంపాదించుకోవడమే కాకుండా తండ్రికి తగ్గ తనయుడిగా మంచి గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాలు వరుసగా మంచి విజయాలను సాధించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెట్టాయనే చెప్పాలి. ఇలాంటి నేపధ్యం లోనే మరి కొంతమంది స్టార్ హీరోలు సైతం తనకి పోటీగా వచ్చినప్పటికి ఎప్పటికప్పుడు తన సినిమాలతో మంచి విజయాలను సాధిస్తూ స్టార్ హీరోలందరికి గట్టి పోటీని ఇస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న సుకుమార్ లాంటి దర్శకుడు సైతం రామ్ చరణ్ తో రంగస్థలం అనే సినిమాను చేసి ఆయనకు భారీ ఇండస్ట్రీ హిట్ ని కట్టబెట్టాడు. మరి ఇప్పుడు మరోసారి వీళ్ళ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. ఈ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నాడు. ఇక సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ కి రామ్ చరణ్ చేసిన సినిమాల్లో రెండు సినిమాలంటే బాగా ఇష్టమట. అందులో ఒకటి చిరుత, మరొకటి మగధీర…
ఇక రామ్ చరణ్ కెరీర్ మొదట్లో చేసిన ఈ రెండు సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. వీటివల్లే ఆయన మెగా పవర్ స్టార్ గా ఎదగడమే కాకుండా తర్రికి తగ్గ తనయుడుగా కూడా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు. రామ్ చరణ్ రీసెంట్ గా చేసిన ‘గేమ్ చేంజర్’ (Game Changer) సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. అయినప్పటికి తన మార్కెట్ కి ఏ విధమైన నష్టం అయితే వాటిల్లలేదని తెలుస్తోంది.
ఇక యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ లాంటి నటుడు లేడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆయన చేసిన ‘రంగస్థలం’ (Rangasthalam) సినిమాలోని నటన నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇక ఆ సినిమాకి సుకుమార్ దర్శకుడు కావడం వల్ల వీళ్ళ మధ్య మంచి బాండింగ్ అయితే కుదిరింది.
మరి మరోసారి అదే సక్సెస్ ని రిపీట్ చేస్తారా లేదా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ భారీ విజయాన్ని అందుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…
Also Read : రామ్ చరణ్ తో సుకుమార్ మళ్ళీ సైకిల్ తొక్కిస్తున్నాడా..?