Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. బన్నీ సరసన హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 17న “పుష్ప ది రైజ్ ” పేరుతో ఫస్ట్ పార్ట్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించారు చిత్ర బృందం. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా రాజమౌళి, కొరటాల శివ, మారుతి, బుచ్చిబాబు వంటి దర్శకులు హాజరయ్యారు.

ఇదిలా ఉంటే సుకుమార్ స్థానంలో ఆయన కూతురు సుకృతి ఈవెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. తను తెలంగాణ యాసలో మాట్లాడిన తీరు అభిమానులను బాగ ఆకట్టుకున్నాయి. అంత పెద్ద వేదికలో సుకృతి అంత బాగా మాట్లాడుతుందని ఎవరూ ఊహించి ఉండరు. సుకృతి మాట్లాడుతూ… ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని ఫ్యామిలీతో కలిసి ఈ చిత్రాన్ని చూడాలని ఈ సినిమా కోసం తన తండ్రి ఎంతో కష్టపడ్డారు తన మాటల్లో చెప్పగా. అలానే బన్నీ మామ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు అంటూ ముద్దు ముద్దు మాటలతో ఈ చిత్రాన్ని కి మంచి విజయం చేకూర్చాలని కోరుతూ చివరిగా తగ్గేది లేదంటూ ముగించింది సుకృతి. రష్మిక మందన్న అనసూయ మంగ్లీ తదితరులు ఈ సినిమా విశేషాలు చెప్పుకొచ్చారు. కాగా మరోవైపు ఈ ప్రిరిలీజ్ ఈవెంట్ పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
