https://oktelugu.com/

Sukumar Birthday Special: ‘సుకుమార్’కి ఉన్న ఈ రికార్డ్స్ మరో దర్శకుడికి లేవు !

Sukumar Birthday Special: క్రియేటివిటీని లెక్కలతో తూకం వేయగల ‘క్రియేటివ్ డైరెక్టర్’ అతను. లెక్కల మాస్టర్ గా ఇండస్ట్రీకి వచ్చి స్క్రీన్ ప్లే మాస్టర్ గా మారిన దార్శనిక దర్శకుడు అతను. సక్సెస్ రేట్ కి కూడా ఓ ఫార్ములా ఉందని నిరూపించిన గ్రేట్ ఎమోషనల్ డైరెక్టర్ అతను.. అతనే సుకుమార్. ఒక్కప్పుడు భార‌తీయ సినామాను బాలీవుడ్ డైరెక్టర్స్ ఏలితే.. డిజిట‌ల్ యుగం వ‌చ్చాక తెలుగు డైరెక్టర్స్ ఏలుతున్నారు. వారిలో రాజమౌళి తర్వాత స్థానం ‘సుకుమార్’దే. ఇంతకీ […]

Written By:
  • Shiva
  • , Updated On : January 11, 2022 / 02:07 PM IST

    Sukumar

    Follow us on

    Sukumar Birthday Special: క్రియేటివిటీని లెక్కలతో తూకం వేయగల ‘క్రియేటివ్ డైరెక్టర్’ అతను. లెక్కల మాస్టర్ గా ఇండస్ట్రీకి వచ్చి స్క్రీన్ ప్లే మాస్టర్ గా మారిన దార్శనిక దర్శకుడు అతను. సక్సెస్ రేట్ కి కూడా ఓ ఫార్ములా ఉందని నిరూపించిన గ్రేట్ ఎమోషనల్ డైరెక్టర్ అతను.. అతనే సుకుమార్. ఒక్కప్పుడు భార‌తీయ సినామాను బాలీవుడ్ డైరెక్టర్స్ ఏలితే.. డిజిట‌ల్ యుగం వ‌చ్చాక తెలుగు డైరెక్టర్స్ ఏలుతున్నారు. వారిలో రాజమౌళి తర్వాత స్థానం ‘సుకుమార్’దే. ఇంతకీ ఎవ‌రీ సుకుమార్ ?

    Sukumar Birthday Special

     

    సుకుమార్ పూర్తి పేరు బండ్రెడ్డి సుకుమార్. తూర్పు గోదావ‌రి జిల్లా మ‌ట్ట‌పాడులో 1970లో జ‌న‌వ‌రి 11న పుట్టాడు ఈ దర్శక దిగ్గ‌జం. గ‌ణిత అధ్యాప‌కుడిగా కెరీర్ ను మొదలు పెట్టి.. నేడు పాన్ ఇండియా డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఎక్క‌డా రాజీ ప‌డ‌ని మ‌న‌స్త‌త్వం సుకుమార్ స్వంతం. సుకుమార్ లో ద‌ర్శ‌కుడే కాదు, వినూత్న ర‌చ‌యిత‌ ఉన్నాడు, విప్లవాత్మకమైన ఆలోచ‌నాప‌రుడు ఉన్నాడు, అన్నిటికి మించి సుక్కులో ఓ తాత్వికుడు ఉన్నాడు.

    Also Read:  ఐసీయూలో ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్.. ఆందోళనలో ఫ్యాన్స్..!

    ఏ ఇండస్ట్రీ లోనైనా స్టార్ హీరోల వల్ల డైరెక్టర్ల మార్కెట్ పెరుగుతుంది. కానీ, ఒక్క సుకుమార్ విషయంలోనే.. సుక్కు అనే డైరెక్టర్ వల్ల స్టార్ హీరోల మార్కెట్ పెరిగింది. ఆర్య‌ సినిమాతో బన్నీకి మార్కెట్ ను క్రియేట్ చేశాడు. ‘100% లవ్’ సినిమాతో చైతు సినిమాలకు కూడా ఓపెనింగ్స్ వస్తాయని నిరూపించాడు. ‘నేనొక్క‌డినే’ సినిమాతో మ‌హేష్ బాబును పాన్ ఇండియా రేంజ్ లో నిలబెట్టాడు.

    ‘నాన్న‌కు ప్రేమ‌తో’ సినిమాతో జూనియ‌ర్ ఎన్టీఆర్ మార్కెట్ రేంజ్ ను రెండింతలు పెంచాడు. ‘రంగ‌స్థ‌లం’తో చరణ్ కెరీర్ కే మైల్ స్టోన్ లాంటి సినిమా ఇచ్చి.. ఇండస్ట్రీ నాన్ బాహుబలి రికార్డ్స్ ను కొల్లగొట్టాడు. ఇప్పుడు ‘పుష్ప’తో బన్నీని పాన్ ఇండియా స్థాయిలో ఐకాన్ స్టార్ గా నిలబెట్టాడు. సుకుమార్ కి ఉన్న ఈ రికార్డ్స్ మరో దర్శకుడికి లేవు.

    సహజంగా సృజ‌నాత్మ‌క‌త క‌లిగిన వ్య‌క్తి కాబట్టే.. సుకుమార్ విజన్ కి నేను పెద్ద ఫ్యాన్ అని రాజమౌళి లాంటి డైరెక్టర్ కూడా బాహాటంగా చెప్పాడు. అయితే, సుకుమార్ కి సక్సెస్ అంత ఈజీగా రాలేదు. ఎన్నో అవమానాలు, మరెన్నో కష్టాలు.. అన్నిటికీ మించి మరెన్నో అనుభవాలు.. బహుశా అందుకే.. కథల పై పాత్రల పై సుకుమార్ కి ఉన్నంత అవగాహన మరో దర్శకుడి దగ్గర చూడలేం.

    పైగా ఒక కమర్షియల్ స్క్రిప్ట్ ను, హాలీవుడ్ స్టైల్ లో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా తీయడం అంటే.. బహుశా తెలుగులో అది ఒక్క సుకుమార్ కి మాత్రమే సాధ్యం. సుక్కు ఫోటోగ్రఫీలో కూడా ఓ ప్రత్యేకత ఉంటుంది. ఏ కథలోనైనా నేపథ్యంలో నుంచి పాత్రలు వస్తాయి, కానీ సుకుమార్ కథల్లో మాత్రమే పాత్రల్లో కూడా నేపథ్యం కనిపిస్తుంది. అది ఫోటోగ్రఫీ పై సుక్కుకి ఉన్న అవగాహన.

    ఇక ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా కావొచ్చు. సుక్కు సినిమాల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ కథకు, ఎమోషన్ కి అనుగుణంగానే ఉంటుంది. ఇలా ప్రతి క్రాఫ్ట్ మీద సుకుమార్ కి ఉన్న కమాండ్ ని, కమిట్‌మెంట్ ని ఏ లెక్కతో విలువ కట్టలేనిది. నిజానికి ఓవర్ బడ్జెట్ చిత్రాల్లో చాలా తలనొప్పులు ఉంటాయి, అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి, ఇంకా అనేక పరిమితులు ఉంటాయి.

    ఈ రకరకాల లెక్కల మధ్య ఎన్నో ఈక్వేషన్లతో ఒక భారీ సినిమాను, అతి తక్కువ సమయంలో తీయడం.. ఇప్పటివరకు ఇండియన్ సినిమా చరిత్రలో అది ఒక్క ‘పుష్ప’తోనే జరిగింది. ఒక్క సుకుమార్ మాత్రమే దాన్ని సాధించాడు. పైగా ప్రతి షాట్ టేకింగ్ లో త‌న‌దైన ముద్ర‌ కనబరుస్తూ సుకుమార్ పుష్ప సినిమాని తీశాడు. అది సుకుమార్ అంటే.

    అన్నట్టు సుకుమార్ పుస్త‌కాల ప్రేమికుడు. నిత్య పాఠ‌కుడు. తన నుంచి వచ్చే ఒక్కో చిత్రం ఒక్కో వైవిధ్యం. నేడు ఆయన పుట్టినరోజు.. ఆయనకు ఓకే తెలుగు నుండి ప్రత్యేక శుభాకాంక్షలు.

    Also Read:  ‘వనమా’ దొరికాడిలా.. రామకృష్ణ ఫ్యామిలీ ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్

    Tags