Pushpa: లెక్కల మాస్టర్ నుంచి సుకుమార్ దర్శకుడిగా మారాడు. అందుకే ఆయన సినిమా లెక్కలు వేరేలా ఉంటాయి. అవన్నీ ఎవరికీ అంతుచిక్కవు. సుకుమార్ తన ప్రతీ సినిమాను చివరవరకు ఏదో ఒక కరెక్షన్ చేస్తూనే ఉంటాడు. ఈ వ్యవహారం మొత్తం అతడితో పనిచేసే వారికే కామనే. అయితే మరో వారంలో ‘పుష్ప’ మూవీ విడుదల కానుండగా ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ అవుట్ పుట్ రెడీ కాలేదని తెలుస్తోంది. దీంతో ‘పుష్ప’ నిర్మాతలు టెన్షన్ పడుతున్నారని ఇండస్ట్రీలో టాక్ విన్పిస్తోంది.

సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాక దర్శకులంతా ప్రమోషన్స్ పైనే దృష్టి పెడుతుంటారు. విడుదలకు ఒకటి రెండు వారాల ముందే ఫైనల్ కాపీని సిద్దం చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. చివరి నిమిషంలో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే సుకుమార్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటాడు. సినిమా సెన్సార్ పూర్తయినా కూడా సుకుమార్ తన సినిమాకు ఎడిటింగ్ వర్క్ చేస్తూనే ఉంటాడని ఇండస్ట్రీలో టాక్.
‘పుష్ప’ విషయంలోనూ ఇదే సీన్ రిపీట్ అవుతుందని సమాచారం. మరో వారంలో సినిమా ‘పుష్ప’ థియేటర్లలోకి రానుండగా సుకుమార్ మాత్రం ఇంకా ఎడిటింగ్ వర్క్ చేస్తూనే ఉన్నాడట. తొలి కాపీని చూసిన సుకుమార్ సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నాడట. దీంతో ఇప్పుడు రేయింబవళ్లు ఎడిటింగ్ టేబుల్ దగ్గరే కూర్చొనే ఉంటున్నాడని టాక్.
అయితే సెన్సార్ బోర్డు అభ్యంతర పెట్టని విధంగా చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయడం ఇండస్ట్రీలో కామనే అని పలువురు అంటున్నారు. మామూలుగా అయితే ఓవర్సీస్‌కు వారం ముందుగానే కేడీఎంలు డెలివర్ చేయాల్సి ఉంటుంది. కాగా సుకుమార్ మూవీలకు మాత్రం ఆలస్యం జరుగుతూ ఉంటుంది. పుష్ప విడుదల తేది దగ్గరపడుతున్నా ఇంకా కేడీఎంలు రెడీ కాలేదని తెలుస్తోంది.
సుకుమార్ ఇంకా ‘పుష్ప’ను చెక్కుతూనే ఉండటం కారణమని తెలుస్తోంది. ఎడిటింగ్ కరెక్షన్ పూర్తయ్యాక రీరికార్డింగ్, సౌండ్ డిజైన్ పనులు పూర్తి చేసి అప్పుడు ఫస్ట్ కాపీ వదులుతారు. దీంతో మరో మూడ్రోరోజులు సుకుమార్ కు ఇదే పని ఉండనుంది. దీంతో విడుదలకు రెండ్రోజుల ముందు కానీ పుష్ప తొలి కాపీ రెడీకాదని తెలుస్తోంది. దీంతో నిర్మాతలు సమయానికి చిత్రం రిలీజు అవుతందా? లేదా? అని టెన్షన్ పడుతున్నారని ఫిల్మ్ నగర్లో టాక్ విన్పిస్తోంది.