RRR Movie: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా… భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్… తారక్ కి జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరీస్ నటిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో “ఆర్ఆర్ఆర్ ” టీం దూకుడుగా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసింది.

కాగా తాజాగా హైదరాబాద్ లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు “ఆర్ఆర్ఆర్” చిత్రబృందం. ఈ కార్యక్రమంలో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు అలియా భట్ కూడా పాల్గొంది. ఇక సమావేశంలో భాగంగా జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఇద్దరు హీరోలతో పాటు రాజమౌళి కూడా సమాధానాలు చెప్పారు. అయితే ఓ సందర్భంలో రాజమౌళి మాట్లాడుతూ లేచి నిలబడి… వీళ్లు ఇద్దరూ తను కొట్టాడు, గిచ్చాడు అని కంప్లయింట్స్ ఇచ్చారని గుర్తుచేశాడు. 300 రోజులు షూటింగ్ చేస్తే అందులో 25 రోజులు వీళ్ళ వల్ల వేస్ట్ అయ్యిందేమో అని జోక్ గా అన్నారు. దీనికి స్పందించిన ఎన్టీఆర్… ఆయన దాడి చేస్తుంటే.. పెదరాయుడిలాగా మీరేమైనా ధర్మం చెప్పారా.. తీర్పు చెప్పారా.. అని ప్రశ్నించాడు. వెంటనే రామ్ చరణ్ లేచి.. ఏంటి నేను దాడి చేశానా… అంటూ నిలదీశాడు. చివర్లో ప్రోగ్రామ్ అయిపోయాక ఇద్దరు స్టార్లు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలకు పోజులిచ్చారు. ఒకరి వెనకాల మరొకరు చేయి వేసుకున్నారు. ఈ సమయంలో… ఒక్కసారిగా ఝలక్ తగిలినట్టుగా ఎన్టీఆర్ స్పందించాడు. రామ్ చరణ్ గిచ్చాడనే ఎక్స్ ప్రెషన్ ఇస్తూ వెంటనే దూరం జరిగాడు. అదేంటి.. అలా పక్కకు జరిగావని రామ్ చరణ్ అనడంతో మళ్లీ నవ్వుతూ ఫొటోలకు పోజులిచ్చారు.
