Og Movie: మెగా ఫ్యామిలీ అనగానే మనకు చిరంజీవి పవన్ కళ్యాణ్ ను ముందుగా గుర్తొస్తారు ఎందుకంటే వీళ్ళిద్దరూ మెగా ఫ్యామిలీలో మెయిన్ పిల్లర్లుగా నిలబడి మెగా ఫ్యామిలీ మొత్తాన్ని ముందుకు తీసుకెళుతున్న స్టార్లుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక వీళ్ల తర్వాత ఇండస్ట్రీకి చాలామంది హీరోలు వచ్చినప్పటికీ వీళ్లు మాత్రం ఎప్పటికీ ప్రత్యేకంగా గుర్తుండి పోతారు ఇక ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ క్రేజ్ ప్రస్తుతం తారస్థాయిలో ఉందని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఎందుకంటే ఆయన సినిమాలు రిలీజ్ అయిన సమయంలో ఆయన ఫ్యాన్స్ చేసే హంగామా గాని, ఆయన ఫ్యాన్స్ ద్వారా అతని సినిమాకు వచ్చే కలక్షన్స్ గాని చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాలు వరుసగా మంచి విజయాలను అందుకోవడమే కాకుండా తనకి మంచి పేరును కూడా తీసుకొచ్చి పెట్టాయి.
ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అటు జనసేన పార్టీ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ తను షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది…
Also Read: సలార్ మూవీ ఫస్ట్ రివ్యూ
ఇక ఇదే క్రమంలో తనతో పాటు ఓజీ సినిమాని చేస్తున్న సుజీత్ ప్రస్తుతం సినిమాకి బ్రేక్ ఇచ్చాడు దాంతో తను ఒక కొత్త ప్రాజెక్టు చేసే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక సుజీత్ ఇప్పటికే ఇండస్ట్రీకి వచ్చి 10 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ తన కెరీయర్ లో రెండు సినిమాలు మాత్రమే చేశాడు. దాంతో ఇకమీదట సినిమాల విషయంలో లేట్ చేయకూడదనే ఉద్దేశ్యం తో దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తను ఒక అద్భుతమైన స్క్రిప్ట్ ను రాసి తమిళ్ సూపర్ స్టార్ అయిన రజనీకాంత్ కి వినిపించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ తో సినిమా అయిపోగానే రజనీకాంత్ సినిమా స్టార్ట్ చేయాలనే ఉద్దేశ్యం తోనే సుజిత్ ఈ పని చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఖాళీ సమయం దొరికినప్పుడు దాన్ని సద్వినియోగపర్చుకోవడంలో సుజిత్ చాలా ముందు వరుసలో ఉన్నాడని నేటితరం దర్శకులు గుర్తించాలి.
ఎందుకంటే ఆయన కెరీయర్ మొదట్లో చాలా వరకు డల్ గా నడిచినప్పటికీ ఇప్పుడు మాత్రం తన కెరీయర్ ని పరుగులు పెట్టించే పనిలో ఉన్నాడు…ఆయన చేస్తున్న పనికి చాలామంది సినీ విమర్శకులు సైతం అతన్ని ప్రశంసిస్తున్నారు…నిజానికి పవన్ కళ్యాణ్ బ్రేక్ ఇవ్వడం వచ్చిన బ్రేక్ ని సుజీత్ చాలా బాగా వాడుకుంటున్నాడు…
అందుకే మనసుంటే మార్గం ఉంటుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు…