Suhani Bhatnagar: ఈమె నటించిన సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.2000 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలన విజయం సాధించింది. దాంతో అందరూ ఈమెకు వరుసగా అవకాశాలు వచ్చి స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదుగుతుంది అనుకున్నారు. కానీ ఎవరు ఊహించని విధంగా ఈ హీరోయిన్ 19 ఏళ్ల చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయింది. ఆమె ఊహించని మరణంతో సినిమా ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. నటీనటులు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవాలని ఎన్నో కలలు కంటారు. కొంతమంది అదృష్టం కలిసి వచ్చి కేవలం ఒక్క సినిమాతోనే ఊహించని స్టార్డం సొంతం చేసుకుంటారు. మరి కొంతమంది ఎన్నో ఒడిదుడుకులను దాటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొని సక్సెస్ సాధిస్తారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన కొందరు నటీనటులు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు గా కూడా సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నారు. కానీ మరి కొంతమంది మాత్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అదృష్టం కలిసి రాక సినిమా ఇండస్ట్రీకి దూరమవుతున్నారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఈ నటి జీవితం ఒక విషాద గాధ. ఈమె బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టింది. ఈమె ఒక స్టార్ హీరోయిన్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ 19 ఏళ్ల చిన్న వయసులో ప్రాణాలు కోల్పోయి అందరికి షాక్ ఇచ్చింది. ఈ నటి సుహాని భట్నాగర్.
Also Read: ఒకే ఒక్క సినిమాతో బాగా ఫేమస్ అయిన హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా..
12 ఏళ్ల అతి చిన్న వయసులో చైల్డ్ ఆర్టిస్టుగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె నటించిన దంగల్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. కానీ ఈ సినిమాలో నటించిన సుహాని 19 ఏళ్ల చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయింది. నితీష్ తివారి దర్శకత్వం చేసిన దంగల్ సినిమా 2016 లో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎన్నో రికార్డులను ఈ సినిమా తిరగరాసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.2070 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి భారీ విజయం సాధించింది. మనదేశంలోనే రూ.538 కోట్లు ఈ సినిమా రాబట్టింది.
ఇక ఈ సినిమాలో గీత ఫోగట్, భబిత పోగొట్ అక్కాచెల్లెళ్ల చిన్నప్పటి పాత్ర కోసం ఏకంగా 11 వేల మంది అమ్మాయిలకు ఆడిషన్స్ నిర్వహించారు. అందులో కేవలం ఇద్దరు మాత్రమే సెలెక్ట్ అయ్యారు. ఆ ఇద్దరిలో సుహాని భట్నాగర్ కూడా ఒకరు. సుహాని దంగల్ సినిమాలో బబితా ఫాగట్ చిన్నపాటి పాత్రలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో ఈమె నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఈ సినిమాతో ఆమెకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. 2023లో సుహానికి అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. ఒంట్లో నీరసం, శరీరంపై ఎరాటి మచ్చలు రావడంతో ఆమె ఆరోగ్యం నెమ్మదిగా క్షీణించింది. కొన్నాళ్లు అనారోగ్యంతో పోరాడిన సుహాని చివరకు ఫిబ్రవరి 17, 2024లో కన్ను మూసింది.