
Sudigali Sudhir – Mallemala : మల్లెమాల సంస్థ కొందరు స్టార్స్ మీద ఆధారపడింది. ఆ సంస్థ నిర్మించిన జబర్దస్త్, ఢీ భారీ విజయాలు అందుకున్నాయి. ఆ సక్సెస్ వెనుక నాగబాబు, అనసూయ, రోజా, సుధీర్, హైపర్ ఆది, రష్మీ వంటి ఆర్టిస్ట్స్ ల కృషి ఉంది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ మల్లెమాలకు బంగారు గనిలా దొరికాడు. ఎక్స్ట్రా జబర్దస్త్ కి సుడిగాలి సుధీర్ టీమ్ ప్రధాన ఆకర్షణ. మిగతా టీమ్స్ మీద ఆడియన్స్ కి పెద్దగా అంచనాలు ఉండవు. సుధీర్-గెటప్ శ్రీను-రామ్ ప్రసాద్ ల ట్రియో సంచలనాలు నమోదు చేశారు. ఈ ముగ్గురు పర్ఫెక్ట్ కాంబినేషన్ నాన్ స్టాప్ నవ్వులు పంచుతారు.
సుధీర్ మేనియా ఢీ షోకి కూడా ఉపయోగపడింది. అక్కడ రష్మీ గౌతమ్ తో ఆయన రొమాన్స్ హైలెట్. రష్మీ-సుధీర్ కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయ్యింది. వీరిద్దరూ యాంకర్స్ గా చేసిన సీజన్స్ టీఆర్పీ విపరీతంగా రాబట్టాయి. చెప్పాలంటే సుధీర్ మల్లెమాలకు పెద్ద ఆదాయవనరు. సుధీర్-రష్మీల మీద లవ్ ట్రాక్స్ క్రియేట్ చేసి విపరీతంగా లాభపడ్డారు. అలాంటి సుధీర్ ని ఆ సంస్థ ఎందుకు వదులుకుందనేది పెద్ద ప్రశ్న. ఢీ సీజన్ 14 నుండి రష్మీ-సుధీర్ లను తప్పించారు.
మెల్లగా జబర్దస్త్ నుండి, ఆపై శ్రీదేవి డ్రామా కంపెనీకి సుధీర్ గుడ్ బై చెప్పేశాడు. ఆయన చెప్పాడా? లేక వాళ్ళే పంపించారా? అనేది సస్పెన్సు. మల్లెమాలతో ఏర్పడిన గొడవలే సుధీర్ నిష్క్రమణకు కారణమని ప్రముఖంగా వినిపించింది. ఈటీవీకి దూరమయ్యాక సుధీర్ స్టార్ మా, ఆహా యాప్ లలో షోలు చేశాడు. కాబట్టి ఆయనకు యాంకరింగ్ చేసే టైం, ఇంట్రెస్ట్ ఉన్నాయని అర్థం అవుతుంది. కానీ మల్లెమాల షోస్ నుండి బయటకు వచ్చారు.
గాలోడు చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న సుధీర్ ఈ విషయం మీద స్పందించారు. మల్లెమాలతో విభేదాలున్నాయనేది నిజం కాదు. కొన్ని కారణాల వలన ఆరు నెలలు అనుమతి తీసుకుని బయటకు వచ్చాను. త్వరలో నా రీఎంట్రీ ఉంటుంది. నేను ఇప్పుడు ఫ్రీ అని మల్లెమాల వాళ్లకు చెప్పాను. నా మీద కొన్ని కొత్త షోలు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. జబర్దస్త్ తో పాటు మల్లెమాల షోస్ లో మరలా కనిపిస్తాను అన్నారు.
ఆ మాట చెప్పి చాలా కాలం అవుతుంది. సుధీర్ మాత్రం జబర్దస్త్ కి రాలేదు. సడన్ గా ఆయన శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ప్రత్యక్షమయ్యారు. థాంక్యూ స్పెషల్ పేరుతో రూపొందించిన ఎపిసోడ్ లో సుధీర్ మెరిశాడు. దీంతో సుధీర్ రీ ఎంట్రీ ఇచ్చాడనే ఊహాగానాలు మొదలవుతున్నాయి. ఒకవేళ అదే నిజమైతే ఆదాయం లేక సుధీర్ కాంప్రమైజ్ అయ్యాడా? లేక టీఆర్పీలు రాక మల్లెమాల ఆయన్ని బ్రతిమిలాడి తెచ్చుకుందా? అనే వాదన మొదలైంది. అయితే ఒక షోలో కనిపించినంత మాత్రానా సుధీర్ మల్లెమాల సంస్థలో అడుగుపెట్టినట్టు చెప్పలేం. చూడాలి సుధీర్-మల్లెమాల ఎపిసోడ్ ఎలాంటి మలుపు తీసుకుంటుందో…