Rashmi Gautam Birthday Party: స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ ఇటీవల బర్త్ డే జరుపుకున్నారు. ఏప్రిల్ 27 ఆమె జన్మదినం కాగా గ్రాండ్ పార్టీ ఇచ్చారు. రష్మీ బర్త్ డే పార్టీకి ఫ్రెండ్స్, సన్నిహితులు హాజరయ్యారు. తన బర్త్ డే ఫోటోలు రష్మీ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. సదరు ఫోటోలకు ఓ అద్భుతమైన కొటేషన్ కూడా ఇచ్చింది. నీతో ఉండేవాళ్లు ఉంటారు. పోయేవాళ్లు పోతారు. నువ్వు మాత్రం మారకు. నా జీవితంలో మరొక ఇయర్ అయిపోయింది. ఫ్యాన్స్, ఫ్రెండ్స్, పేరెంట్స్ నా లైఫ్ లో ప్రధానమైన మూడు పిల్లర్స్. మీ అందరికీ కృతజ్ఞతలు… అంటూ కామెంట్ పోస్ట్ చేశారు. రష్మీకి సోషల్ మీడియా జనాలు బర్త్ డే విషెస్ చెప్పారు.
రష్మీ బర్త్ డే పార్టీకి ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. సుడిగాలి సుధీర్ మాత్రం రాలేదు. రష్మీ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలలో సుధీర్ లేకపోవడంతో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సుడిగాలి సుధీర్ ఎక్కడ? ఆయన నీ బర్త్ పార్టీకి రాలేదా? లేదంటే మీరు పిలవలేదా? అని రష్మీని ప్రశ్నిస్తున్నారు. ఇక జీవితంలో ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్లు పోతారని రష్మీ కామెంట్ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
రష్మీ గౌతమ్-సుడిగాలి సుధీర్ లవర్స్ అనే ప్రచారం ఎప్పటి నుండో ఉంది. వీరిద్దరూ కలిసి పలు షోలు చేశారు. వందల ఎపిసోడ్స్ లో కనిపించారు. నాన్ స్టాప్ రొమాన్స్ కురిపించారు. వీరి లవ్ ట్రాక్స్ సక్సెస్ కావడంతో ఢీ, జబర్దస్త్ వేదికగా పలు స్కిట్స్ చేశారు. రెండుసార్లు ఉత్తుత్తి వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో సుధీర్-రష్మీ లవర్స్ అనే నమ్మకం బలపడిపోయింది. అయితే మేము స్నేహితులం మాత్రమే అని వీరు చెబుతుంటారు. లవ్, రొమాన్స్ బుల్లితెర వరకే పరిమితం అంటారు.
రష్మీకి పెళ్లీడు వచ్చి చాలా కాలం అవుతుంది. అలాగే సుధీర్ కూడా ముదిరిపోతున్నాడు. ఇద్దరూ పెళ్లి మాటెత్తడం లేదు. దీంతో ఎక్కడో ఓ మూలన అనుమానాలు ఉన్నాయి. ఏదో ఒక రోజు సడన్ గా బాంబు పేల్చుతారనే అంచనాలు ఉన్నాయి. సుడిగాలి సుధీర్ హీరోగా కూడా సక్సెస్ అయ్యాడు. గత ఏడాది ఆయన నటించిన గాలోడు సూపర్ హిట్ కొట్టింది. దర్శకుడు దశరథ్ తో సుడిగాలి సుధీర్ మూవీ ఓకే అయ్యిందనే ప్రచారం జరుగుతుంది. రష్మీ యాంకర్ గా సత్తా చాటుతుంది. వెండితెర ఆమె జోరు తగ్గింది.