Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ మీడియా ముందుకు వస్తే చాలు రష్మీ గౌతమ్ గురించి ప్రశ్నల వర్షం కురిపిస్తారు మీడియా. ఆయన లేటెస్ట్ మూవీ కాలింగ్ సహస్ర విడుదలకు సిద్ధం కాగా ట్రైలర్ విడుదల ఈవెంట్ నిర్వహించారు. మీడియా సమావేశంలో సుధీర్ పెళ్లి ప్రస్తావన వచ్చింది. రష్మీ గౌతమ్ తో ప్రేమ, పెళ్లి విషయాలపై క్లారిటీ ఇవ్వాలని అన్నారు. రష్మీ గౌతమ్ తో మీ రిలేషన్ ఏమిటీ? ఆమెతో మీ పెళ్లి ఎప్పుడు? ఒకవేళ మరో అమ్మాయితో అయితే ఎలాంటి వివాహం చేసుకుంటారు? లవ్వా, అరేంజ్డ్? అని పలు ప్రశ్నలు సంధించారు.
సుడిగాలి సుధీర్ అన్ని ప్రశ్నలకు సహనంగా సమాధానం చెప్పాడు. నేను గతంలో కూడా చెప్పాను. ఆన్ స్క్రీన్ వరకే మా లవ్, రొమాన్స్, ఆఫ్ స్క్రీన్ లో మేము మంచి ఫ్రెండ్స్ మాత్రమే. ఇక రష్మీ గౌతమ్ తో నా పెళ్లి అనే ప్రస్తావనే లేదు అన్నాడు. మాటల్లో మాటగా ఆయన మరో బాంబు పేల్చాడు. పెళ్లి చేసుకునే ఆలోచన లేదన్నాడు. ప్రస్తుతం దృష్టి కెరీర్ మీదే. పెళ్లి చేసుకునే ఆలోచన లేదన్నాడు.
సుడిగాలి సుధీర్ ని అభిమానించే అమ్మాయిల హృదయాలు బద్దలయ్యే కామెంట్ ఇది. అయితే మరో మాటగా… జీవితంలో ఏదైనా జరగొచ్చు. పెళ్లి ట్రాక్ అనేది ఒకటి జీవితంలోకి వస్తే చేసుకుంటానేమో. ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదని కుండబద్దలు కొట్టాడు. 35 ఏళ్ల సుధీర్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సుధీర్ కి ఒక తమ్ముడు ఉన్నాడు. అతడికి పెళ్లి పిల్లలు కూడా ఉన్నారు. సుధీర్ ఇంకా పెళ్లి చేసుకోలేదు.
సుధీర్ బెస్ట్ ఫ్రెండ్స్ రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను చాలా కాలం క్రితమే పెళ్లిళ్లు చేసుకున్నారు. వారికి కూడా పిల్లలు ఉన్నారు. కాగా బుల్లితెర షోలలో సుధీర్ తనది ప్లే బాయ్ ఇమేజ్ గా క్రియేట్ చేసుకున్నాడు. మరి నిజ జీవితంలో ఎలాంటి వాడు అనేది తెలియదు. హీరోగా ఎదుగుతున్న సుధీర్ గాలోడు మూవీతో హిట్ కొట్టాడు. ప్రస్తుతం కాలింగ్ సహస్త్ర టైటిల్ తో క్రైమ్ థ్రిల్లర్ చేస్తున్నాడు. ఈ మూవీ డిసెంబర్ 1న విడుదల కానుంది.