Sudigali Sudheer Rashmi : సుడిగాలి సుధీర్-రష్మీ గౌతమ్ లవ్ ఎఫైర్ ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్. ఈ విషయంలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. జబర్దస్త్ వేదికగా వీరి ప్రయాణం మొదలైంది. జబర్దస్త్ తో పాటు ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్లో నాన్ స్టాప్ రొమాన్స్ కురిపించారు. సుధీర్ ఈటీవీ వదిలి వెళ్ళాక కొంచెం గ్యాప్ వచ్చింది. తాజాగా సుధీర్ రీఎంట్రీ ఇచ్చాడు. వస్తూనే రష్మీతో రొమాన్స్ మొదలుపెట్టాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ లో సుధీర్ కనిపిస్తున్నారు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఇక నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అంటున్నారు. అదే క్రమంలో సుధీర్-రష్మీ లవ్ ఎఫైర్ మరలా తెరపైకి వచ్చింది.

తాజాగా రష్మీతో తన రిలేషన్ ఏమిటనే విషయంపై క్లారిటీ ఇచ్చాడు. సుధీర్ ఎప్పుడూ చెబుతుందే మళ్ళీ చెప్పాడు. మా ఇద్దరి మధ్య ఉంది స్నేహం మాత్రమేనని స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆన్ స్క్రీన్ లోనే మేము ప్రేమికులం, ఆఫ్ స్క్రీన్ లో కాదు. డైరెక్టర్ కట్ చెప్పాక, ఎవరి దారులు వారివే. ఒక్కోసారి అసలు మాట్లాడుకోము కూడా. స్కిట్ వరకే మా కెమిస్ట్రీ పరిమితం. అది కూడా అనుకోకుండా జరిగింది. పదేళ్లుగా మా మధ్య నడుస్తుంది అదే అని సుధీర్, అన్నారు.
ప్రొఫెషన్ లో భాగంగా మేమిద్దరం రొమాన్స్ కురిపించినా, తర్వాత ఎవరిదారులు వారివే మా పని పూర్తి అయ్యాక మాటలు కూడా ఉండవని సుధీర్ చెప్పారు. మరోవైపు ఇటీవల రష్మీ చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు దారి తీశాయి. సుధీర్ నాకు ఏమవుతాడు, మా మధ్య ఉన్న బంధం ఏమిటో మాకు తెలుసు. దాన్ని బయటకు చెప్పాల్సిన అవసరం లేదు. జీవితంలోని ప్రతి విషయాన్ని చెప్పేస్తే ఇంకేమీ మిగలదు. భవిష్యత్ లో అన్నీ తెలుస్తాయి అన్నారు.
రష్మీ చేసిన ఈ కామెంట్స్ ఎఫైర్ పుకార్లకు ఆజ్యం పోశాయి. కాగా సుధీర్ హీరోగా తెరకెక్కిన గాలోడు మూవీ నవంబర్ 18న విడుదల కానుంది. హీరోగా సుధీర్ కి ఇది మూడో చిత్రం. గతంలో ఆయన నటించిన సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ అనుకున్న స్థాయిలో ఆడలేదు. హీరోగా పరిశ్రమలో ఎదగాలని గట్టిగా ట్రై చేస్తున్న సుధీర్ కి గాలోడు ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.