https://oktelugu.com/

Sudheer Babu : న్యూయార్ వెకేషన్ ని బాగా ఎంజాయ్ చేసిన మహేష్ బావ సుధీర్ బాబు… ఫోటోలు వైరల్

ఈ విషయంలో సుధీర్ బాబు వాళ్ళ బావ మరిది అయిన మహేష్ బాబు ని ఫాలో అవుతూ ఉంటాడు. ఇక అందులో భాగంగానే సుధీర్ బాబు తన ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ వెకేషన్ కి వెళ్లి అక్కడే న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకున్నాడు. దా

Written By:
  • NARESH
  • , Updated On : January 4, 2024 / 10:36 PM IST
    Follow us on

    Sudheer Babu : సూపర్ స్టార్ కృష్ణ అల్లుడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు తక్కువ కాలంలోనే మంచి హిట్లను అందుకొని చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులను అలరించడం లో ఎప్పుడు ముందుంటాయి. ఇక ఇది ఇలా ఉంటే సుదీర్ బాబు సినిమాలకు ఎంత ప్రిఫరెన్స్ ఇస్తాడో తన ఫ్యామిలీకి కూడా అంతే ప్రిఫరెన్స్ ఇస్తాడు. షూటింగ్ ల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన ఫ్యామిలీతో పాటు వెకేషన్ కి మాత్రం వెళ్తూ ఉంటాడు.

    ఈ విషయంలో సుధీర్ బాబు వాళ్ళ బావ మరిది అయిన మహేష్ బాబు ని ఫాలో అవుతూ ఉంటాడు. ఇక అందులో భాగంగానే సుధీర్ బాబు తన ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ వెకేషన్ కి వెళ్లి అక్కడే న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకున్నాడు. దానికి సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నాడు.

    ఇక సుధీర్ బాబు న్యూ ఇయర్ వేడుకలను సెలబ్రేట్ చేసుకోవడానికి పోర్ట్ బ్లేయర్ వెళ్ళాడు… ఇక అక్కడ సందడి చేస్తూ దిగిన ఫోటోలను ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్ తో పంచుకుంటున్నాడు ఇక దానికి కొంతమంది సుధీర్ బాబును ఉద్దేశించి మీరు సూపర్ సార్ సినిమా తోపాటు ఫ్యామిలీకి కూడా టైమ్ ని కేటాయిస్తారు అంటూ కామెంట్స్ చేయగా, మరి కొంతమంది మాత్రం మీరు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు సార్ అంటూ కామెంత్సే చేస్తున్నారు…

    ప్రస్తుతం సుధీర్ బాబు రెండు మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఇక ఇప్పటికే హర్ష వర్ధన్ డైరెక్షన్ లో చేసిన మామా మచ్చిందా అనే సినిమా ఫ్లాప్ అవడంతో ఇప్పుడు వచ్చే సినిమాతో మంచి సక్సెస్ ని కొట్టి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే ఆయన చాలా స్క్రిప్ట్ లను వింటూ మంచి కథలను సెలెక్ట్ చేసుకొని సినిమాగా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక సుధీర్ బాబు ఇక మీదట వచ్చే సినిమాలతో ఆయన సక్సెస్ లను సాధించి ఇండస్ట్రీలో మంచి హీరోగా గుర్తింపు పొందుతాడా లేదా అనే విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…