Homeఎంటర్టైన్మెంట్Krithi Shetty- Sudigali Sudheer: ఏకంగా కృతి శెట్టిపై కన్నేసిన సుడిగాలి సుధీర్... నీకు తగిన...

Krithi Shetty- Sudigali Sudheer: ఏకంగా కృతి శెట్టిపై కన్నేసిన సుడిగాలి సుధీర్… నీకు తగిన వాడ్ని నేనే అంటూ ఓపెన్ ప్రపోజల్

Krithi Shetty- Sudigali Sudheer: ఏకంగా బేబమ్మ పైనే కన్నేశాడు సుడిగాలి సుధీర్. నాకు పెళ్లి కాలేదు నీకు పెళ్లి కాలేదు అంటూ గాలం వేసే ప్రయత్నం చేశాడు. సుధీర్ సాహసానికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. విషయంలోకి వెళితే స్టార్ మా లో ప్రసారం అవుతున్న సూపర్ సింగర్ షోకి యాంకర్స్ గా అనసూయ, సుడిగాలి సుధీర్ వ్యవహరిస్తున్నారు.ఇక సూపర్ సింగర్ గ్రాండ్ ఫినాలే ఈవెంట్ మరింత ఆకర్షణీయంగా సిద్ధం చేశారు. హాస్యబ్రహ్మ బ్రహ్మానందం,నాగార్జున హాజరయ్యారు.

Krithi Shetty- Sudigali Sudheer
Krithi Shetty- Sudigali Sudheer

కాగా ఈ గ్రాండ్ ఫినాలేకి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ టీం కృతి శెట్టి, సుధీర్ బాబు, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ హాజరయ్యారు. వేదికపైకి వచ్చిన కృతి శెట్టిని సుడిగాలి సుధీర్ ఇంప్రెస్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ వేదికపై పెళ్లి కానీ వాళ్ళు ఇద్దరే ఉన్నారు ఒకరు కృతి శెట్టి మరొకరు నేను అన్నాడు. అంటే ఆమెకు లైన్ వేస్తున్నావా? అని అనసూయ సుడిగాలి సుధీర్ ని అడిగారు. అసలు కృతి శెట్టికి ఎలాంటి అబ్బాయి కావాలో చెబితే బాగుంటుంది అన్నారు.

Also Read: Political Meetings: తెలుగునాట కొత్త సంస్కృతి.. సీఎంల సమావేశాలకు బెదిరింపు జన సమీకరణ

తనకు కైండ్ హార్ట్, పాజిటివ్ యాటిట్యూడ్, సపోర్టివ్ గా ఉండే హస్బెండ్ కావాలని కృతి చెప్పారు. ఈ లక్షణాన్నీ నాలో ఉన్నాయని సుధీర్ మళ్ళీ బిస్కెట్ వేశాడు. కొంచెం చబ్బీగా కూడా ఉండాలని కృతి చెప్పగా, అవును నేను చాలా చబ్బీ కావాలంటే పొట్ట చూడండి అంటూ కోటు బటన్ తీసి చూపించారు. మరి ఇందాక సిక్స్ ప్యాక్ అన్నారు అని కృతి అనగా, సిక్స్ ప్యాక్ లో కూడా చబ్బీగా ఉండొచ్చని సుధీర్ సమాధానం చెప్పారు. సుధీర్, కృతి మధ్య జరిగిన ఈ సంభాషణ వేదికపై ఉన్న మను, చిత్ర, హేమ చంద్రలతో పాటు ఆడియన్స్ చేత నవ్వులు పూయించింది.

Krithi Shetty- Sudigali Sudheer
Krithi Shetty- Sudigali Sudheer

అయితే ఇవన్నీ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మేనేజర్స్ ఎంటర్టైన్మెంట్ కోసం ముందుగానే ప్లాన్ చేస్తారు. ఇక హ్యాట్రిక్ విజయాలతో ఒక్కసారి టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిన కృతిని ది వారియర్, మాచర్ల నియోజకవర్గం దెబ్బతీశాయి. వరుసగా రెండు ప్లాప్స్ పడడంతో డీలా పడింది . ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ మూవీతో కమ్ బ్యాక్ కావాలని చూస్తుంది. అటు హీరో సుధీర్, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణకు కూడా ఈ మూవీ విజయం చాలా కీలకం.

Also Read:YSRCP: వైసీపీలో ఆధిపత్య పోరాటాలు షురూ.. ఎవరికి మూడుతుందో?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
Oktelugu Epaper
Exit mobile version