Krithi Shetty- Sudigali Sudheer: ఏకంగా కృతి శెట్టిపై కన్నేసిన సుడిగాలి సుధీర్… నీకు తగిన వాడ్ని నేనే అంటూ ఓపెన్ ప్రపోజల్

Krithi Shetty- Sudigali Sudheer: ఏకంగా బేబమ్మ పైనే కన్నేశాడు సుడిగాలి సుధీర్. నాకు పెళ్లి కాలేదు నీకు పెళ్లి కాలేదు అంటూ గాలం వేసే ప్రయత్నం చేశాడు. సుధీర్ సాహసానికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. విషయంలోకి వెళితే స్టార్ మా లో ప్రసారం అవుతున్న సూపర్ సింగర్ షోకి యాంకర్స్ గా అనసూయ, సుడిగాలి సుధీర్ వ్యవహరిస్తున్నారు.ఇక సూపర్ సింగర్ గ్రాండ్ ఫినాలే ఈవెంట్ మరింత ఆకర్షణీయంగా సిద్ధం చేశారు. హాస్యబ్రహ్మ బ్రహ్మానందం,నాగార్జున హాజరయ్యారు. కాగా ఈ […]

Written By: Shiva, Updated On : August 28, 2022 3:07 pm
Follow us on

Krithi Shetty- Sudigali Sudheer: ఏకంగా బేబమ్మ పైనే కన్నేశాడు సుడిగాలి సుధీర్. నాకు పెళ్లి కాలేదు నీకు పెళ్లి కాలేదు అంటూ గాలం వేసే ప్రయత్నం చేశాడు. సుధీర్ సాహసానికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. విషయంలోకి వెళితే స్టార్ మా లో ప్రసారం అవుతున్న సూపర్ సింగర్ షోకి యాంకర్స్ గా అనసూయ, సుడిగాలి సుధీర్ వ్యవహరిస్తున్నారు.ఇక సూపర్ సింగర్ గ్రాండ్ ఫినాలే ఈవెంట్ మరింత ఆకర్షణీయంగా సిద్ధం చేశారు. హాస్యబ్రహ్మ బ్రహ్మానందం,నాగార్జున హాజరయ్యారు.

Krithi Shetty- Sudigali Sudheer

కాగా ఈ గ్రాండ్ ఫినాలేకి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ టీం కృతి శెట్టి, సుధీర్ బాబు, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ హాజరయ్యారు. వేదికపైకి వచ్చిన కృతి శెట్టిని సుడిగాలి సుధీర్ ఇంప్రెస్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ వేదికపై పెళ్లి కానీ వాళ్ళు ఇద్దరే ఉన్నారు ఒకరు కృతి శెట్టి మరొకరు నేను అన్నాడు. అంటే ఆమెకు లైన్ వేస్తున్నావా? అని అనసూయ సుడిగాలి సుధీర్ ని అడిగారు. అసలు కృతి శెట్టికి ఎలాంటి అబ్బాయి కావాలో చెబితే బాగుంటుంది అన్నారు.

Also Read: Political Meetings: తెలుగునాట కొత్త సంస్కృతి.. సీఎంల సమావేశాలకు బెదిరింపు జన సమీకరణ

తనకు కైండ్ హార్ట్, పాజిటివ్ యాటిట్యూడ్, సపోర్టివ్ గా ఉండే హస్బెండ్ కావాలని కృతి చెప్పారు. ఈ లక్షణాన్నీ నాలో ఉన్నాయని సుధీర్ మళ్ళీ బిస్కెట్ వేశాడు. కొంచెం చబ్బీగా కూడా ఉండాలని కృతి చెప్పగా, అవును నేను చాలా చబ్బీ కావాలంటే పొట్ట చూడండి అంటూ కోటు బటన్ తీసి చూపించారు. మరి ఇందాక సిక్స్ ప్యాక్ అన్నారు అని కృతి అనగా, సిక్స్ ప్యాక్ లో కూడా చబ్బీగా ఉండొచ్చని సుధీర్ సమాధానం చెప్పారు. సుధీర్, కృతి మధ్య జరిగిన ఈ సంభాషణ వేదికపై ఉన్న మను, చిత్ర, హేమ చంద్రలతో పాటు ఆడియన్స్ చేత నవ్వులు పూయించింది.

Krithi Shetty- Sudigali Sudheer

అయితే ఇవన్నీ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మేనేజర్స్ ఎంటర్టైన్మెంట్ కోసం ముందుగానే ప్లాన్ చేస్తారు. ఇక హ్యాట్రిక్ విజయాలతో ఒక్కసారి టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిన కృతిని ది వారియర్, మాచర్ల నియోజకవర్గం దెబ్బతీశాయి. వరుసగా రెండు ప్లాప్స్ పడడంతో డీలా పడింది . ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ మూవీతో కమ్ బ్యాక్ కావాలని చూస్తుంది. అటు హీరో సుధీర్, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణకు కూడా ఈ మూవీ విజయం చాలా కీలకం.

Also Read:YSRCP: వైసీపీలో ఆధిపత్య పోరాటాలు షురూ.. ఎవరికి మూడుతుందో?

Tags