Crazy Hero: సుధీర్ బాబు హీరోగా అమ్మాయి గురించి మీకు చెప్పాలి అంటూ ఒక సినిమా రిలీజ్ అయింది. పైగా ఈ మూవీ లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. దీనికితోడు పలు విజయవంత మైన మూవీలకు దర్శకత్వం వహించిన ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ సినిమాకి దర్శకుడు. అందుకే, ఈ సినిమా హిట్ ఆవుతుంది అనుకున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ పరిస్థితి ఏమిటి ?, అసలు ఈ సినిమాకి ఓపెనింగ్స్ వచ్చాయా ? లేదా ?, వర్షాల ప్రభావం అయితే ఈ సినిమా పై బాగానే పడింది. మరి ఈ సినిమా నిర్మాతకు లాభాలు వస్తాయా ? లేక, నష్టాలే మిగిలే ఛాన్స్ ఉందా ? చూద్దాం రండి.

ముందుగా ఈ సినిమా 7 డేస్ కలెక్షన్స్ ను గానూ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.
Also Read: Nani- Merlapaka Gandhi: కెరీర్ ని రిస్క్ లో పడేసిన హీరో నాని..ఆ ఫ్లాప్ డైరెక్టర్ తో సినిమా అవసరమా!
నైజాం 0.21 కోట్లు
సీడెడ్ 0.06 కోట్లు
ఉత్తరాంధ్ర 0.11 కోట్లు
ఈస్ట్ 0.06 కోట్లు
వెస్ట్ 0.05 కోట్లు
గుంటూరు 0.05 కోట్లు
కృష్ణా 0.06 కోట్లు
నెల్లూరు 0.04 కోట్లు
ఏపీ + తెలంగాణలో 7 డేస్ కలెక్షన్స్ గానూ 0.63 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 1.26 కోట్లు వచ్చాయి.
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.06 కోట్లు
ఓవర్సీస్ 0.15 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ గా 7 డేస్ కలెక్షన్స్ గానూ రూ. 0.84 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 7 డేస్ కలెక్షన్స్ గానూ రూ. 1.68 కోట్లను కొల్లగొట్టింది.

‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రానికి రూ.7.74 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. కానీ 7 డేస్ కలెక్షన్స్ ను బట్టి.. ఈ చిత్రం సేఫ్ అయ్యే అవకాశం దాదాపు అసాధ్యమే. సహజంగానే సుదీప్ బాబు సినిమాలకి ఓపెనింగ్స్ రావు. దీనికితోడు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. కాబట్టి.. ఏ రకంగా చూసుకున్నా ఈ సినిమా సేఫ్ అవ్వడం కష్టమే. ఇక ఇప్పటివరకు ఉన్న లెక్కలను బట్టి థియేటర్స్ లో ఈ చిత్రం 80 % రెవిన్యూ ని నష్టపోనుంది. ఈ కలెక్షన్స్ చూసి హీరో సుధీర్ బాబు డిప్రెషన్ లోకి వెళ్లి పోయినట్లు తెలుస్తోంది. చివరకు మహేష్ బాబు ఫోన్ కాల్ చేసి సుధీర్ ను ఓదార్చి నట్లు తెలుస్తోంది.
Also Read: Young Hero: ఒక్క ప్లాప్ తో 4 ఎకరాలు అమ్మేసిన హీరో.. నిర్మాతలు దూరం.. ఇప్పుడు ఈ హీరో పరిస్థితి ఏంటి ?