తమిళస్టార్ హీరో విజయ్ తో సుధా కొంగర చిత్రం

మన తెలుగు డైరెక్టర్ సుధ కొంగర పేరు ఇపుడు దేశ వ్యాప్తంగా వినిపిస్తోంది. సౌత్ ఇండియాలోనే ఓ సూపర్ హిట్ సినిమాతో తన పేరు మార్మోగేలా చేసుకోంది . 2016 లో మాధవన్ రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో ఆమె రూపొందించిన ‘ఇరుదు సుట్రు’ తమిళంలో సెన్సేషనల్ హిట్టయింది. ఇదే సినిమా హిందీలో `సాలా ఖండూస్ ‘ గా విడుదలై అక్కడ కూడా సక్సెస్ అయ్యింది. కాగా దీన్ని తెలుగులో ‘గురు’ పేరుతో రీమేక్ చేస్తే ఇక్కడ […]

Written By: admin, Updated On : May 6, 2020 11:18 am
Follow us on


మన తెలుగు డైరెక్టర్ సుధ కొంగర పేరు ఇపుడు దేశ వ్యాప్తంగా వినిపిస్తోంది. సౌత్ ఇండియాలోనే ఓ సూపర్ హిట్ సినిమాతో తన పేరు మార్మోగేలా చేసుకోంది . 2016 లో మాధవన్ రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో ఆమె రూపొందించిన ‘ఇరుదు సుట్రు’ తమిళంలో సెన్సేషనల్ హిట్టయింది. ఇదే సినిమా హిందీలో `సాలా ఖండూస్ ‘ గా విడుదలై అక్కడ కూడా సక్సెస్ అయ్యింది. కాగా దీన్ని తెలుగులో ‘గురు’ పేరుతో రీమేక్ చేస్తే ఇక్కడ కూడా భారీ విజయం దక్కింది. ప్రస్తుతం గజని ఫేమ్ సూర్య హీరోగా ` సూరారై పోట్రు` పేరుతొ సుధ కొంగర ఒక సినిమా రూపొందిస్తోంది. కాగా ఈ సినిమా ‘ఆకాశమే నీ హద్దురా’ పేరు తో అనువదించబడి తెలుగులో విడుదలకు సిద్ధంగా ఉంది. లాక్ డౌన్ లేకపోతే ఈపాటికి ప్రేక్షకుల ముందుకు వచ్చేది. అయితే ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే సుధ కొంగర కు ` విజిల్ ` ఫేమ్ ఇళయ దళపతి విజయ్ తో సినిమా చేసే అవకాశం వచ్చిందని తెలుస్తోంది .

మత సామరస్యం సాధ్యమేనా ? (Part 4)

తన తర్వాతి సినిమా విజయ్ తోనే ఉంటుందని సుధ కొంగర పరోక్షంగా చెప్పింది. .తన కొత్త సినిమా ప్రకటన జూన్ 22న ఉంటుందంటూ ఆమె ఇటీవల ఒక ట్వీట్ చేసింది. నిజానికి ఆ తేదీ విజయ్ పుట్టిన రోజు..దాంతో సుధ కొంగర విజయ్ తో చేయబోయే సినిమా గురించి ఆ రోజు చెప్పబోతుందని అంతా అనుకొంటున్నారు .