Suchitra Sen: సినిమా ఇండస్ట్రీలో వచ్చిన పేరును చివరి వరకు కాపాడుకోవడం చాలా అవసరం. కానీ చాలామంది నటీనటులు ఈ విషయంలో ఫెయిల్ అయ్యారు అని చెప్పొచ్చు. చాలా కష్టాలు పడిన తర్వాత తమకు వచ్చిన స్టార్డం నిలబెట్టుకోలేక చాలామంది సినిమా ఇండస్ట్రీ నుంచి దూరం కూడా అయ్యారు. ఇదే కనక జరిగితే వారి జీవితం విషాదవంతం అవుతుంది. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే హీరోయిన్ కూడా తన స్టార్ డంను చివరి వరకు నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయ్యింది అని చెప్పొచ్చు. దాదాపు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మూడు దశాబ్దాలు రాణించిన ఈ హీరోయిన్ చివరకు ఒక చీకటి గదిలో అనామకురాలిగా తన జీవితాన్ని ముగించింది. ఈ హీరోయిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు గెలుచుకున్న మొదటి భారతీయ నటిగా కూడా గుర్తింపు తెచ్చుకొని లక్షల మంది హృదయాలలో స్థానం సంపాదించుకుంది. సుచిత్ర సేన్ ఒకప్పుడు భారతీయ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. సుచిత్ర సేన్ ఏప్రిల్ 6, 1931లో బంగ్లాదేశ్ లో ఉన్న పాబ్న లో పుట్టింది.
చిన్నతనం నుంచి నటన మీద ఆసక్తితో సుచిత్ర సేన్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన ప్రయత్నాలు మొదలుపెట్టింది. శేష్ కోతే అనే బెంగాలీ సినిమాతో 1952లో సుచిత్ర సేన్ తన డేబ్ల్యు ఇచ్చింది. ఆ తర్వాత ఆమెకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. కొన్ని ఏళ్లు బెంగాలీ సినిమాలలో నటించిన తర్వాత ఆమె బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ సమయంలో ఉత్తమ్ కుమార్ వంటి స్టార్ హీరోలతో కూడా కలిసి నటించింది. ఈమె కెరీర్ లో చాలా హిట్ సినిమాలు ఉన్నాయి. దేవదాస్, అంది, బొంబాయి కా బాబు, మమతా వంటి సూపర్ హిట్ సినిమాలు హిందీలో ఎన్నో ఉన్నాయి. సుచిత్ర సేన్ 1975 వరకు కూడా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగిందని చెప్పొచ్చు. ఆంది సినిమాతో ఈమె తన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. అలాగే దత్త అనే మరో సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ హిట్ అందుకుంది.
ఆ తర్వాత ఈమె కేవలం ఒక్క సినిమాలో మాత్రమే నటించింది. ప్రణయ్ పాషా అనే సినిమాతో 1978లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. ఈమె బెంగాలీ సినిమా సాత్ పాకే బాంధ లో తన నటనకు గాను అంతర్జాతీయ ఉత్తమ నటిగా కూడా ఎంపిక అయింది. అలాగే సుచిత్ర సేమ్ మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో 1963 లో అవార్డును అందుకొని ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయ నటిగా చరిత్రలో నిలిచింది. చిన్నతనంలోనే పెళ్లి చేసుకున్న కెరీర్ బిజీగా ఉండడంతో భర్తకు తగినంత సమయం ఇవ్వకపోవడంతో వీరి మధ్య దూరం పెరిగి చివరకు భర్త ముందుకు బానిస అయ్యి ఆమెను వదిలేసి అమెరికా వెళ్ళిపోయారు. 1970లో ఆమె భర్త మరణించారు. ఆ తర్వాత క్రమంగా సినిమాలను వదిలేసిన సుచిత్ర 36 ఏళ్ల పాటు ఒక గదిలో తనను తాను బంధి చేసుకుంది. ఆ చీకటి గదిలోనే సుచిత్ర 83 ఏళ్ల వయసులో ఒక అనామకురాలిగా చనిపోయింది.
Also Read: పాకిస్థాన్‌పై దాడికి భారత్ వ్యూహం.. కీలక స్థావరం గుర్తింపు!