
ఎఫ్2.. టాలీవుడ్ లో ఎంత నవ్వులు పంచి ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ లు హీరోలుగా నటించిన కామెడీ ఎంటర్ టైన్ మెంట్ టాలీవుడ్ లోనే అద్భుత విజయాన్ని సాధించింది. ఇప్పుడు ‘ఎఫ్2’కు సీక్వెల్ గా ‘ఎఫ్3’ని అనిల్ రావిపూడి రూపొందించారు. ఈ సినిమాలో కమెడియన్ సునీల్ పాత్రనే హైలెట్ గా నిలువనుందనే టాక్ వినిపిస్తోంది.
అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ఎఫ్2 మూవీ 2019 సంక్రాంతికి విడుదలైంది. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోవడంతో ఈ సినిమాకు బ్రేక్ పడింది. పరిస్థితులు కుదురుకున్నాక ఇటీవలే కొంతకాలం క్రితం తిరిగి ప్రారంభమైంది.
మొదటి సినిమాలో భార్యా-భర్తల మధ్య గొడవలు, అపార్థాలు, విడిపోవడం.. మళ్లీ కలుసుకోవడం చుట్టూ కథ తిరిగింది. దానికి సీక్వెల్ గా రూపొందే ఎఫ్3లో మొత్తం డబ్బు చుట్టూ కథ తిరుగుతుందట.. ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కమెడియన్ సునీల్ నటిస్తున్నాడు. ‘అహ నా పెళ్లంటా’ సినిమాలో అత్యంత పిసినారి పాత్ర చేసిన కోటా శ్రీనివాసరావు పాత్రను పోలి ఉండేలా ‘ఎఫ్3’ సినిమాలో అనిల్ రావిపూడి తాజాగా సునీల్ పాత్రను తీర్చిదిద్దాడట.. సునీల్ కెరీర్ లోనే ఈ పిసినారి పాత్ర హైలెట్ గా నిలుస్తుందట.. సునీల్ ఎంత రెచ్చిపోయాడో చూడాలంటే సినిమా వరకు ఎదురుచూడాల్సిందే.