Stylish Telugu Film Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే కొంతమందికి స్టార్ డైరెక్టర్లు మాత్రమే గుర్తుకొస్తారు. కారణం ఏంటి అంటే వాళ్ళు చేసే సినిమాలు భారీ బడ్జెట్ తో రూపొందించడమే కాకుండా టాప్ లెవల్లో ముందుకు దూసుకెళ్తుంటారు. అలాగే వాళ్ళు సాధించే సక్సెస్ లు భారీ రేంజ్ లో ఉంటాయి. వాటిని మించిన సక్సెస్ లను సాధించడానికి చాలామంది దర్శకులు పోటీపడుతున్నప్పటికి అవేవీ కొందరికి మాత్రమే వర్కౌట్ అవుతున్నాయి. దాంతో చాలామంది దర్శకులు టాప్ డైరెక్టర్లుగా మారడానికి భారీ బడ్జెట్ సినిమాలను చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది తెలుగులో కొంతమంది దర్శకులు స్టైలిష్ మేకర్స్ గా పేరు సంపాదించుకున్నారు. అందులో సురేందర్ రెడ్డి ఒకరు. ఆయన చేసిన ప్రతి సినిమాలో ప్రతి ఫ్రేమ్ చాలా స్టైలిష్ గా ఉంటుంది.
చాలా కొత్తగా చూపించడానికి ఆయన ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అందుకే అతనికి సక్సెస్ లతో పాటు క్రేజ్ కూడా బాగా పెరిగింది. అక్కినేని అఖిల్ తో చేసిన ‘ఏజెంట్’ సినిమా తీవ్రంగా నిరాశపర్చడంతో ఆయన కొంతవరకు డీలా పడ్డాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.
ఇక ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తే మాత్రం సురేందర్ రెడ్డి టాప్ డైరెక్టర్ గా మరోసారి పేరు సంపాదించుకుంటాడు… ఇక కొరటాల శివ సైతం కెరియర్ స్టార్టింగ్ లో చేసిన మిర్చి, శ్రీమంతుడు సినిమాలను ఆయన చాలా స్టైలిష్ గా తెరకెక్కించాడు. కానీ ఆ తర్వాత మాత్రం ఆయన దానిని కంటిన్యూ చేయలేకపోయాడు.
ఇక ఏది ఏమైనా కూడా సురేందర్ రెడ్డి లాంటి దర్శకుడు ఒక భారీ సినిమాని చేస్తే మాత్రం ఆ మూవీ సూపర్ సక్సెస్ ని సాధిస్తుందని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ సినిమాతో ఆయన సక్సెస్ బాట పడతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఆయన లాగా అంత స్టైలిష్ గా సినిమాలను చేసే దర్శకులు తెలుగులో మరొకరైతే లేరు…