Stunning sets of Raja Saab: నిన్న మొన్నటి వరకు ప్రభాస్(Rebel Star Prabhas) ‘రాజాసాబ్'(Raja Saab Movie) మూవీ ని అభిమానులు సైతం తక్కువ చూసేవారు. కారణం ఆ సినిమాకు మారుతి(Maruthi) డైరెక్టర్ అవ్వడమే. ప్రభాస్ లాంటి పాన్ ఇండియన్ సూపర్ స్టార్ తో ఫామ్ లో లేని ఒక మీడియం రేంజ్ డైరెక్టర్ సినిమా చేయడం ఏమిటి?, అసలు ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అంటూ అభిమానులు ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా లో వారానికి ఒకసారి మూవీ టీం ని ట్యాగ్ చేసి తిడుతూ ఉండేవారు. కానీ ఈరోజు విడుదల చేసిన టీజర్ ని చూసిన తర్వాత అభిమానుల నోటి నుండి మాట రాలేదు. ఇది కదా ప్రభాస్ నుండి మేము ఇన్ని రోజులు మిస్ అయ్యింది. మా ఆకలిని తీర్చే సినిమా ఇచ్చావు అంటూ డైరెక్టర్ మారుతి పై ప్రశంసల వర్షం కురిపించారు. అంతే కాదు టీజర్ లాంచ్ ఈవెంట్ తర్వాత మూవీ టీం అక్కడికి వచ్చిన జర్నలిస్టులను ‘రాజా సాబ్’ సెట్స్ కి తీసుకెళ్లారు.
సెట్స్ కి వెళ్లిన తర్వాత కొన్ని వీడియోలను షూట్ చేసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేశారు. అవి బాగా వైరల్ అయ్యాయి. సెట్స్ ఎంత గ్రాండ్ గా ఉన్నాయో..చూస్తుంటేనే కళ్ళు తిరిగేస్తున్నాయి. ఇది కదా గ్రాండియర్ సినిమా అంటే, ఇది నిజమైన బంగ్లా అంటే ఎవరైనా నమ్మేస్తారు,అంత అద్భుతంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఈ భారీ బంగ్లా ని VFX తో కూడా మ్యానేజ్ చేయొచ్చు. కానీ ఇంత ఖర్చు ఎవ్వరూ ఊహించనంత అవుతుంది. ఇలా సెట్స్ ని ఏర్పాటు చేయడం వల్ల VFX షాట్స్ కోసం కష్టపడాల్సిన అవసరం రాలేదు. సినిమా సగానికి పైగా ఈ సెట్స్ లోనే షూటింగ్ ని పూర్తి చేసుకుంది. సోషల్ మీడియా ని ఊపేస్తున్న ఈ సెట్స్ ని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.
‘రాజా సాబ్’ గారి తాత గారు ఈ ప్యాలస్ ని తన మనవడికి ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే ఇది కేవలం ఆయనకు మాత్రమే సొంతమట. చనిపోయిన తర్వాత కూడా దీనిని ఆయన మాత్రమే అనుభవించాలట. ఎవరికీ దానిపై అధికారం లేదట. తాత ఆస్తి చట్టప్రకారం మనవడికి చెందుతుంది కాబట్టి ప్రభాస్ ఈ ప్యాలస్ ని వెతుక్కుంటూ వస్తాడు. ప్యాలస్ లోకి అడుగుపెట్టిన తర్వాత తాత చూపించే టార్చర్ ని తట్టుకొని ఎలా బయటపడ్డాడు అనేదే స్టోరీ. సినిమా నిడివి దాదాపుగా మూడు గంటల వరకు ఉంటుందని సమాచారం. ఇంత పెద్ద సినిమా ప్రభాస్ ఈమధ్య కాలం లో చేయలేదు. రెండవ భాగం కూడా అవసరమైతే షూట్ చేస్తారట. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో ప్రభాస్ ముగ్గురు హీరోయిన్స్ తో కలిసి డ్యాన్స్ కూడా చేస్తాడని నేడు డైరెక్టర్ మారుతీ చెప్పుకొచ్చాడు. ఇలాంటి స్వీట్ సర్ప్రైజ్ లు సినిమాలో చాలానే ఉన్నాయని తెలుస్తుంది.