Stranger Things Web Series: ప్రపంచం లోనే అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్(Netflix). 196 దేశాల్లో సేవలు అందిస్తున్న ఈ సంస్థ లో అన్ని దేశాలకు సంబంధించిన సినిమాలు, వెబ్ సిరీస్ లు, డాక్యుమెంటరీలు ప్రతీ వారం విడుదల అవుతూ ఉంటాయి. మన ఇండియా లోని తెలుగు, హిందీ, తమిళం మరియు ఇతర భాషలకు సంబంధించిన సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా ఇందులో చూడొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే మన ఇండియన్ సినిమాని ప్రపంచం నలుమూలలకు వ్యాప్తి చేసిన ఘనత నెట్ ఫ్లిక్స్ సొంతం అని చెప్పొచ్చు. #RRR చిత్రానికి ఆస్కార్ అవార్డు దక్కడానికి కారణం కూడా నెట్ ఫ్లిక్స్ సంస్థనే. 196 దేశాల్లో సేవలు అందిస్తున్న ఈ ఓటీటీ సంస్థ డేటా ని మ్యానేజ్ చేయడానికి ఎన్ని లక్షల సర్వర్లు ఉంటాయో ఊహించువచ్చు. అలాంటి సర్వర్లు కూడా ‘స్ట్రేంజర్ థింగ్స్’ వెబ్ సిరీస్ దాటికి తట్టుకోలేక క్రాష్ అయిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
వివరాల్లోకి వెళ్తే నెట్ ఫ్లిక్స్ లో అత్యంత ప్రజాధారణ సంపాదించుకున్న వెబ్ సిరీస్ లలో ఒకటి స్ట్రేంజర్ థింగ్స్(Stranger Things). ఇప్పటికే నాలుగు సీజన్స్ ని పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ నుండి నేడు 5 వ సీజన్ విడుదలైంది. ఈ సీజన్ కోసం మన ఇండియన్ ఆడియన్స్, ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూసారు. ఇప్పుడు విడుదల చేసిన ఐదవ సీజన్ ని ఫినాలే సీజన్ గా చూడొచ్చు. ఈ సీజన్ ని మూడు వాల్యూమ్స్ గా విడుదల చేస్తున్నారు. మొదటి వాల్యూమ్ నవంబర్ 26న, అనగా నిన్న విడుదల చేశారు. ఈ వాల్యూమ్ లో నాలుగు ఎపిసోడ్స్ ఉన్నాయి. రెండవ వాల్యూమ్ ని డిసెంబర్ 25 న, అదే విధంగా మూడవ వాల్యూమ్ ని డిసెంబర్ 31 న విడుదల చేయబోతున్నారు అట.
మొదటి వాల్యూమ్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సిరీస్ విడుదలకు కొద్దీ గంటల ముందే 14000 మందికి పైగా నెట్ ఫ్లిక్స్ వినియోగదారులకు ‘నెట్ ఫ్లిక్స్ నాట్ వర్కింగ్’ అని వచ్చిందట. వాటిల్లో 51 శాతం కి పైగా వీడియో స్ట్రీమింగ్ సమస్యలు, 41 శాతం కి పైగా సర్వర్ కనెక్షన్ సమస్యలు, 8 శాతం కి పైగా అసలు యాప్ ఓపెన్ అవ్వని సమస్యలు తలెత్తాయి. ఇండియా తో పటు పలు దేశాల్లో చాలా సేపటి వరకు నెట్ ఫ్లిక్స్ పని చేయని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి డిమాండ్ ఉంటుందని నెట్ ఫ్లిక్స్ సంస్థ ముందుగానే ఊహించి బ్యాండ్ విడ్త్ ని 30 శాతం అదనంగా పెంచారు. అయినప్పటికీ కూడా రద్దీని ఆపలేకపోయారు. ఆ రేంజ్ డిమాండ్ ఉన్న వెబ్ సిరీస్ ని ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి.