Rajinikanth And Mahesh Babu And NTR: రజినీకాంత్(Superstar Rajinikanth) కి ప్రాణాపాయ స్థితి రావడం ఏంటి?, మహేష్ బాబు(Superstar Mahesh Babu), ఎన్టీఆర్(Junior NTR) ఆయన్ని కాపాడడం ఏంటి ?, అసలు వాళ్ళిద్దరికీ , రజినీకాంత్ కి సంబంధం ఏంటి?, అసలు ఏమి జరిగింది అని టైటిల్ ని చూసి మీరంతా కంగారు పడి ఉండొచ్చు. ఇది నిజంగానే గతం లో జరిగిందా?, లేదా వీళ్ళ కాంబినేషన్ లో సినిమా సెట్ అయ్యి, అందులో నుండి ఈ సీన్ ఇలా ఉంటుంది అని ఏమైనా లీక్ అయ్యిందా?, ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు మీ మదిలో వచ్చి ఉండొచ్చు. కానీ ఇది నిజంగా జరగలేదు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత నెటిజెన్స్ అత్యధిక శాతం తమ క్రియేటివిటీ ని విచ్చలవిడిగా వాడేస్తున్నారు. అందులో భాగంగా మహేష్ బాబు,ఎన్టీఆర్ ని అన్నదమ్ములుగా చూపిస్తూ, కొన్ని AI వీడియోలు ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ ని రూల్ చేస్తున్నాయి.
అందులో ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. పాపం రజినీకాంత్ అలిసిపోయి రోడ్డు మీద నడిచి వస్తూ సొమ్మసిల్లి స్పృహ తప్పి పడిపోతాడు. ఇది గమనించిన మహేష్ బాబు, ఎన్టీఆర్ పరిగెత్తుకుంటూ రజినీకాంత్ వద్దకు వెళ్లి, అతన్ని లేపేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, కానీ రజిని స్పృహలోకి రాడు. దీంతో వీళ్లిద్దరు ఆయన్ని ఒక బండిలో వేసుకొని హాస్పిటల్ కి తీసుకెళ్లి జాయిన్ చేస్తారు. డాక్టర్ చికిత్స చేయడానికి డబ్బులు బాగా ఖర్చు అవుతాయని చెప్పడం తో, మహేష్, ఎన్టీఆర్ లు బయటకు వెళ్లి, కస్టపడి కూలీ పని చేసి డబ్బులు సంపాదించి తీసుకొని వచ్చి డాక్టర్ కి ఇస్తారు. డాక్టర్ రజినీకాంత్ కి చికిత్స అందిస్తుంది, ఆయన ప్రాణాపాయ స్థితి నుండి బయటకు వస్తాడు, ఆ తర్వాత అందరూ సంతోషం గా నవ్వుకుంటారు. వింటుంటేనే ఎంతో బాగుంది కదూ, ఇది నిజమైతే బాగుండును అని అనిపిస్తుంది కదూ!.
ప్రస్తుతం మల్టీస్టార్రర్ సినిమాలు సర్వసాధారణం అయిపోయాయి కాబట్టి, భవిష్యత్తులో ఈ కాంబినేషన్ లో నిజంగానే సినిమా రావొచ్చు. పైన చెప్పిన సన్నివేశం రిపీట్ అవ్వొచ్చు. కానీ అప్పటి వరకు ఆగలేని వాళ్ళు, క్రింద మేము అందిస్తున్న వీడియో ని చూసి ఎంజాయ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మహేష్, ఎన్టీఆర్ పై వందల సంఖ్యలో ఉన్నాయి. ప్రతీ వీడియో లోనూ వీళ్లిద్దరు అన్నదమ్ములే. క్యూట్ గా చాలా ముద్దుగా ఈ వీడియోస్ లో కనిపిస్తారు. మహేష్ బాబు మరియు ఎన్టీఆర్ అభిమానుల మధ్య ఒకప్పుడు ఫ్యాన్ వార్స్ తారా స్థాయిలో జరిగాయి. కానీ సోషల్ మీడియా లో ఇప్పుడు ఈ రెండు ఫ్యాన్ బేసుల మధ్య ఎలాంటి ఫ్యాన్ వార్స్ లేవు, కాబట్టి ఈ వీడియోస్ ని సోషల్ మీడియా లో షేర్ చేసుకుంటూ ఎంజాయి చేస్తున్నారు.