Bigg Boss 6 Telugu- Hyper Aadi: దీపావళి సందర్భంగా గత ఆదివారం నిర్వహించిన బిగ్ బాస్ స్పెషల్ ఎపిసోడ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన విషయం మన అందరికి తెలిసిందే..గత వారం ఎవ్వరు ఊహించని విధంగా టాప్ 5 కంటెస్టెంట్స్ గా చివరికి వరుకు ఉంటాడు అనుకున్న అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ అవ్వడం అందరిని షాక్ కి గురి చేసింది..ఆ షాక్ నుండి తేరుకొని ఈ వారం ఇంటి సభ్యులందరు బిగ్ బాస్ చెలరేగిపొయ్యి ఆడారు.

అయితే గత ఆదివారం ప్రసారమైన స్పెషల్ ఎపిసోడ్ లో ఎంతో మంది ముఖ్య అతిధులు బిగ్ బాస్ కి వచ్చి సందడి చేసారు..వారిలో హైపర్ ఆది కూడా ఒకరు..హైపర్ ఆది గురించి మన అందరికి తెలిసిందే..ఆయన నోటి నుండి పంచులు తూటాలు లాగ పేలుతాయి..అలాగే ఆయన బిగ్ బాస్ హౌస్ మేట్స్ తో ఆయన కాసేపు సరదాగా మాట్లాడుతూ ఆయన పేల్చిన పంచులు బిగ్ బాస్ హౌస్ ని తగలబెట్టసాయి అని చెప్పొచ్చు..ఆయన పంచులు ఈసారి ఇంటి సభ్యుల మీద ఆ రేంజ్ లో పేలాయి.
హైపర్ ఆది వేసిన పంచులు వల్ల బాగా డిస్టర్బ్ అయినా ఇంటి సభ్యులు బాలాదిత్య మరియు గీతూ అనే చెప్పాలి..హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుండి అన్నాచెల్లెళ్లు గా ఉంటున్న వీళ్లిద్దరి మధ్య హైపర్ ఆది వేసిన పంచులు పెద్ద చిచ్చు పెట్టేసింది..హైపర్ ఆది గత వారం బాలాదిత్య మీద పంచులు వేస్తూ ‘అన్నా..మీరు ఇంటి నుండి బయటకి వచ్చిన తర్వాత నిన్ను అభిమానించే వారు నీకు అన్నీ బ్రాండ్ కంపెనీల సిగరెట్లు మీ ముందు పెడుతారు..పండగ చేసుకోండి’ అని అంటాడు..ఆ మాటలు వీళ్లిద్దరి మధ్య నామినేషన్స్ లో చిచ్చు పెట్టాయి..హైపర్ ఆది గారు సిగరెట్ విషయం లో అలా మాట్లాడడానికి కారణం నువ్వే గీతూ..నీ వల్లే ఆ సిగరెట్ టాపిక్ అంత హైలైట్ అయ్యింది..నాకు అది అసలు నచ్చలేదు అంటూ గీతూ ని నామినేట్ చేస్తాడు..అప్పుడు గీతూ ‘స్వామి నీకొక దండం..ఇక జీవితం లో నీతో మాట్లాడను’ అంటూ బాలాదిత్య తో మాట్లాడడం మానేస్తుంది.

ఇక బిగ్ బాస్ హౌస్ హైపర్ ఆది పెట్టిన చిచ్చు వల్ల బాగా డిస్టర్బ్ అయిన మరో జంట ఇనాయ సుల్తానా మరియు శ్రీహాన్..హౌస్ లోకి వచ్చిన రోజు నుండి గొడవపడుతూ వస్తున్న వీళ్లిద్దరు గత వారం రోజులుగా మంచి స్నేహంతో మెలుగుతూ ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే..అయితే హైపర్ ఆది వచ్చిన రోజు ఈమె మీద వేసిన పంచులు ఆమె అట తీరుని మార్చేసింది..మొన్నటి దాకా సూర్య తో ఉన్నావు..ఇప్పుడు శ్రీహన్ తో ఉంటున్నావు..జనాల్లో అది తప్పుగా వెళ్తుంది అన్నట్టు హైపర్ ఆది తన మార్కు పంచ్ తో పరోక్షంగా హింట్ ఇచేలా చేసాడు.
అప్పటి నుండి ఆమె శ్రీహాన్ తో స్నేహం గా ఉంటూనే అతనిని నామినేట్ చేసింది..ఈరోజు కెప్టెన్సీ టాస్కులో కూడా శ్రీహన్ ని వ్యతిరేకించింది..అలా బిగ్ బాస్ కేవలం వీళ్లిద్దరి మీదనే కాదు..చాలా మంది ఇంటి సభ్యుల ఆట తీరుని మార్చేంత ప్రభావం చూపించింది హైపర్ ఆది తూటాలు లాగ పేల్చిన పంచులు.