
30 ఏళ్ళ క్రితం వచ్చిన చిరంజీవి సినిమా నేటికీ తన జ్ఞాపకాల దొంతర్లను అందరికీ పంచుతోంది. ఖైదీ చిత్రం తరవాత తెలుగు సినిమాకి బాక్స్ ఆఫీస్ లెక్కలు మార్చిన ఘనత చిరంజీవి సినిమాలకే దక్కింది ఖైదీ చిత్రం తరవాత చిరంజీవి వరుసగా ఇండస్ట్రీ హిట్ సినిమాలను ప్రేక్షకులకి అందించడం జరిగింది . ఆ క్రమంలో వచ్చిన `పసివాడి ప్రాణం , యముడికి మొగుడు ,అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద చిరంజీవిని నెంబర్ వన్ ని చేశాయి ఆ క్రమంలో వచ్చిన .జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా చిరంజీవి ఇమేజ్ గ్రాఫ్ ని ఆకాశానికి చేచింది. సినిమా కధకు తగ్గట్టే బయట కూడా పలు అద్భుతాలు జరిగాయి .
మే నెలలో , మండు వేసవిలో తూఫాన్ రావడం ఒక విచిత్రమైతే `జగదేకవీరుడు అతిలోకసుందరి ` సినిమా ఆ తూఫాన్ ని తట్టుకొని బాక్స్ ఆఫీస్ చరిత్ర తిరగరాయడం మరో విశేషం. ఈ సినిమాని అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 70 కేంద్రాల్లో ఈ సినిమాని విడుదల చేస్తే 30 కేంద్రాల్లో డైరెక్టుగా 16 కేంద్రాల్లో షిఫ్ట్ ల వారీగా కలుపుకొని టోటల్ గా ఈ చిత్రం 46 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపు కొంది. ఇక విజయవాడలో అయితే ఏకంగా అప్సర థియేటర్ లో 200 రోజులు దిగ్విజయంగా నడిచింది. ఈ సినిమాకి సంబందించిన ఇంకో విశేషం ఏమిటంటే చిరంజీవి అప్పట్లోనే 35 లక్షలు పారితోషకం తీసుకోగా , హీరోయిన్ శ్రీదేవి 25 లక్షలు తీసుకోవడం జరిగింది.
నిజానికి ఈ చిత్రానికి మూల కథని అందించిన శ్రీనివాస చక్రవర్తి ఈ కథని కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కోసం తయారు చేసుకున్నాడట … ఆ విషయాన్ని ఆయనే స్వయంగా అయిదేళ్ల క్రితం ఒక టి వి ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో వెల్లడించడం జరిగింది