Celebrities Birthday Wishes To Megastar: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా.. తమ అభిమాన కథానాయకుడికి శుభాకాంక్షలు తెలియజేయడానికి, సాధారణ అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా పోటీ పడ్డారు. మరి సినీ మరియు రాజకీయ ప్రముఖుల్లో.. ఎవరు ఏ విధంగా, మెగాస్టార్ కి బర్త్ డే విషెస్ చెప్పారో చూద్దాం.

టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశాడు. ‘ప్రేక్షకుల హృదయాల్లో స్థిరపడిన చిరంజీవిగారు.. తన బ్లడ్ బ్యాంక్ ద్వారా రోగులకు అందిస్తున్న సేవలు, సామాజిక సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమైనవి. ఆయన నిండు నూరేళ్లూ ఆనంద, ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నానని చంద్రబాబు తెలిపారు.

మెగాస్టార్ చిరంజీవికి మంత్రి KTR కూడా విషెస్ చెప్పారు. “ప్రియమైన మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు. మీరు శాంతి, ఆయురారోగ్యాలతో జీవితాంతం సుఖంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని KTR ట్వీట్ చేశాడు.

చిరంజీవికి పవన్ కల్యాణ్ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘నేను ప్రేమించే, గౌరవించే, ఆరాధించే నా ప్రియమైన అన్నయ్య చిరంజీవికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పుట్టినరోజు సందర్భంగా మీకు మంచి ఆరోగ్యం, విజయం, కీర్తి కలగాలని కోరుకుంటున్నాను’ అని పవన్ విష్ చేశారు.

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘మెగాస్టార్, పద్మభూషణ్ చిరంజీవి గారికి ఆత్మీయ పుట్టినరోజు శుభాకాంక్షలు. సినీ పరిశ్రమలో “స్వయంకృషి”తో ఎదిగిన “విజేత”.. సేవా కార్యక్రమాల్లో స్ఫూర్తి ప్రదాత మీరు. భగవంతుని ఆశీస్సులతో మీరు “చిరంజీవి”గా వర్ధిల్లాలని, అసంఖ్యాకమైన మీ అభిమానులకు ఆనందాన్ని పంచాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను’ అని విజయసాయి రెడ్డి తెలిపారు.

ప్రభాస్ విష్ చేస్తూ.. ‘హ్యాపీ బర్త్ డే టు మెగాస్టార్ చిరంజీవిగారు. ఒక్క మా తరానికే కాదు. రానున్న భవిష్యత్తు తరాలకు కూడా మీరే ఇన్స్పిరేషన్ గా ఉంటారు’ అని ప్రభాస్ తెలిపారు.

కళాతపస్వి దర్శకులు కె. విశ్వనాథ్ కూడా చిరుకు తన బర్త్ డే విషెష్ పంపారు. ‘చిరంజీవీగారు మీకు జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాగే ఆయురారోగ్య ఐశ్వర్యాలతో క్షేమంగా సుఖంగా ఉండాలి. మీ కంటే పెద్దవాడిగా ‘శతమానం భవతి శతాయః పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి’ అని ఆశీర్వదిస్తున్నాను’ అని చిరుకి కళాతపస్వి తెలిపారు.

విక్టరీ వెంకటేష్ కూడా విష్ చేస్తూ.. ‘చిరంజీవిగారు జన్మదిన శుభాకాంక్షలు. మీరు మీ జీవితంలో మునుపటి కంటే ఇక పై ఎక్కువ సక్సెస్ ను చూడాలి’ వెంకటేష్ విష్ చేశారు.

కె.రాఘవేంద్రరావు కూడా విష్ చేస్తూ.. ‘మద్రాసులో ఉండే సమయంలో చిరంజీవి పుట్టినరోజుకు అందరం కలుసుకునే సరదాగా గడిపేవాళ్ళం. నిజానికి చిరంజీవి నాకన్నా వయసులో చిన్నవాడు. అయినా.. నేను మాత్రం తనను ‘బాబాయ్’ అని పిలిస్తూ ఉండేవాడిని. ఇప్పటికీ, ఎప్పటికీ చిరంజీవి జగదేకవీరుడే’ అని తెలుగు చిత్రాల దర్శకేంద్రుడు విష్ చేశారు.

ఇక నేడు తెల్లవారుజామునే రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులు కొందరు చిరంజీవి ఇంటికి చేరుకొని ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. పైగా ఇప్పటికే ఈ రోజు మొత్తం సోషల్ మీడియాలో ‘మెగాస్టార్ చిరంజీవి’ పేరే ట్రెండింగ్ అయిపోయింది.