Homeఎంటర్టైన్మెంట్CM Jagan: జగన్ తో స్టార్లు భేటీ.. కానీ, ఎన్టీఆర్ కలవట్లేదు !

CM Jagan: జగన్ తో స్టార్లు భేటీ.. కానీ, ఎన్టీఆర్ కలవట్లేదు !

CM Jagan: సినిమా టికెట్ల రేట్లపై ఈ ఉదయం 11 గం.కు టాలీవుడ్ ప్రముఖులు సీఎం జగన్‌తో సమావేశం కానున్నారు. చిరంజీవి, నాగార్జున, పలువురు ప్రముఖులతో పాటు మహేశ్ బాబు, ప్రభాస్, NTR, రాజమౌళి, కొరటాల శివ సీఎంను కలవనున్నట్లు ముందు చెప్పారు.
తక్కువ టికెట్ రేట్లు అమలైతే మరికొన్ని రోజుల్లో విడుదల కావాల్సిన RRR, సర్కారువారిపాట, రాధేశ్యామ్ సినిమా కలెక్షన్లు భారీగా తగ్గే అవకాశముండటంతో ఈ హీరోలు CMను కలవనున్నారు.

chiru jagan
chiru jagan

కానీ, సీఎం జగన్‌ను కలిసేందుకు వెళ్లిన టాలీవుడ్ ప్రముఖుల్లో జూనియర్ ఎన్టీఆర్ లేడు. తొలుత తారక్ వెళ్తారని ప్రచారం జరిగినా ఆయన బేగంపేట విమానాశ్రయానికి వెళ్లలేదు. మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి తాడేపల్లికి బయలుదేరారు. అలీ, పోసాని, ఆర్ నారాయణ మూర్తి ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. టికెట్ల రేట్లతో పాటు మొత్తం 17 అంశాలపై చర్చ జరగనుంది.

Also Read:  మోడీ రాజ్యాంగం.. టీఆర్ఎస్ కొత్త వ్యూహం

Jr NTR
Jr NTR

ఇక ఏపీలో సినిమా టికెట్ల సమస్యకు ఈరోజు ఎండ్ కార్డు కాదు శుభం కార్డు పడుతుందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ‘సీఎం జగన్ నుంచి నాకు మాత్రమే ఆహ్వానం ఉందని తెలిసింది. నాతోపాటు ఇంకా ఎవరెవరు వస్తున్నారో తెలియదు’ అని బేగంపేట్ ఎయిర్‌పోర్టు వద్ద చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాసేపట్లో తాడేపల్లిలో సీఎం జగన్‌ను సినిమా ప్రతినిధుల బృందం కలవనుంది.

గత కొంత కాలంగా చిత్ర పరిశ్రమలో ఏపీలో ఎదుర్కొంటున్న సమస్యలపై వీరి మధ్య ప్రధానంగా చర్చ జరగనుంది. మరి చిరుతో భేటీ తర్వాత వైఎస్ జగన్ ఎలాంటి ప్రకటన చేస్తాడో ?ఈ మధ్య టాలీవుడ్‌ కు చెందిన కొందరు మాత్రం ఏపీ ప్రభుత్వంను సమర్థిస్తూ జగన్ పై పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు అందుకే, జగన్ మేలు చేస్తాడేమో చూడాలి.

Also Read:   ఫుడ్ పాయిజనింగ్ అయిందా.. బయటపడేందుకు పాటించాల్సిన చిట్కాలు ఇవే!

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

2 COMMENTS

  1. […] Abbas: సంచ‌ల‌న డైరెక్ట‌ర్ శంక‌ర్ సినిమాలు ఎంత డిఫ‌రెంట్ గా ఉంటాయో.. అంత అడ్వాన్స్ గా ఉంటాయి. అందుకే ఆయ‌న సినిమా చేద్దామంటే ఎంత పెద్ద స్టార్ అయినా ఎగిరి గంతేయాల్సిందే. ఎందుకంటే ఆయ‌న డైరెక్ష‌న్లో ఒక్క సినిమా చేసినా స్టార్ డ‌మ్ పెరుగుతుంద‌ని భావిస్తుంటారు సినీ హీరోలు. అయితే ఆయ‌న డైరెక్ష‌న్ లో జీన్స్ సినిమాను తీద్దామ‌ను కున్నాడు. ఒకే పోలిక‌లు ఉన్న ఇద్ద‌రు కుర్రాళ్లు ఒకే అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో అద్భుతంగా తెర‌కెక్కించాడు. […]

  2. […] Tollywood: ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో చిరంజీవి, మహేశ్ బాబు, కొరటాల శివ, నిర్మాత నిరంజన్ రెడ్డితో భేటీ అయిన సంగతి తెలిసిందే. సినీ ప్రముఖులంతా కలిసి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వెళ్లి.. అక్కడి నుంచి తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. కాగా సినీ ప్రముఖులకు జగన్ నుంచి ఘనంగా ఆహ్వానం అందింది. జగన్ అందర్నీ పేరు పేరున పలకరించారు. అనంతరం సమావేశం అయ్యారు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular