ముందుగా రామ్ చరణ్ గురించి చర్చిద్దాం, చరణ్ చేతిలో ‘ఆచార్య’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ లాంటి రెండు భారీ సినిమాలు ఉన్నాయి. అన్నీ కుదిరితే దసరాకు ‘ఆర్‌ఆర్‌ఆర్’ వస్తుందని అంటున్నారు. కానీ ‘ఆచార్య’ కూడా దసరా కానుకగా వచ్చే అవకాశం ఉందనేది ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్. మరి చరణ్ ఏం చేస్తాడో ? ప్రభాస్ పరిస్థితి ఇలాగే ఉంది.
ప్రస్తుతం ప్రభాస్ ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’, ‘సలార్’ లాంటి భారీ పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నాడు. అలాగే నాగ్ అశ్విన్ తో మరో సైన్స్ ఫిక్షన్ కి కూడా డేట్లు ఇచ్చాడు. అయితే రాధేశ్యామ్’ ఆగస్టులో కానీ లేదా దసరాకు బరిలోకి దింపాలని చూస్తున్నారు. కానీ మిగతా సినిమాలన్నీ ఒకేసారి రిలీజ్ కి సిద్ధం అయ్యేలా ఉన్నాయి.
వెంకటేశ్ నటించిన ‘నారప్ప’, ‘దృశ్యం 2’ లాంటి రెండు చిత్రాలు విడుదలకు రెడీగా ఉండటంతో అసలు సమస్య మొదలైంది. వీటిలో ఏది ముందు తీసుకు రావాలో వెంకీ కూడా తేల్చుకోలేకపోతున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళితో తీస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా దాదాపు పూర్తయింది. కొరటాల దర్శకత్వంలో చేస్తోన్న సినిమా, ప్రశాంత్ నీల్ తో చేస్తోన్న సినిమా కూడా ఒకేసారి పూర్తి అయ్యేలా ఉన్నాయి.
పవన్ కల్యాణ్ పరిస్థితి ఇంకా టైట్ గా ఉంది. పవన్ ప్రస్తుతం మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ను అలాగే ‘హరిహర వీరమల్లు’ను మరియు హరీశ్ శంకర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. మిగిలిన హీరోలు అఖిల్, నాని అందరి పరిస్థితి ఇలాగే ఉంది. మరి ఏ సినిమా ఎప్పుడు వస్తోందో చూడాలి.