Singer Mangli : టాలీవుడ్ స్టార్ లేడీ సింగర్ గా వెలిగిపోతుంది మంగ్లీ. పాటకు లక్షల్లో తీసుకుంటుంది. ఆమె డిమాండ్ ఆ రేంజ్ లో ఉంది మరి. మంగ్లీ కర్ణాటక సంగీతంలో డిప్లోమా చేసింది. నిజానికి ఆమె యాంకర్ కూడా కావాలనున్నారు. అయితే విలక్షమైన ఆమె వాయిస్ గాయనిగా గుర్తింపు తెచ్చింది. సినిమాల్లోకి రాక ముందు పొలిటికల్ సాంగ్స్, డివోషనల్ సాంగ్స్ పాడింది. యూట్యూబ్ ఛానల్ లో బోనాలు, సమ్మక్క సారక్క పాటలు పాడింది. అవి విశేషంగా ఆకట్టుకున్నాయి.
మంగ్లీ శివరాత్రి సాంగ్స్ కూడా చాలా ఫేమస్. ఇక శైలజారెడ్డి అల్లుడు మూవీలో మొదటిసారి సినిమాకు పాడింది. 2019లో విడుదలైన జార్జిరెడ్డి చిత్రంలోని ‘వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్’ సాంగ్ విపరీతంగా ప్రాచుర్యం పొందింది. సంగీత దర్శకులు దృష్టిలో పడింది. అనంతరం అల వైకుంఠపురంలో బ్లాక్ బస్టర్ సాంగ్ ‘రాములో రాములో’ పాడింది. దాంతో మంగ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు.
సీటీమార్ చిత్రంలోని జ్వాలారెడ్డి సాంగ్, లవ్ స్టోరీ చిత్రంలోని సారంగదరియా సాంగ్ ఇలా చెప్పుకుంటూ పోతే మంగ్లీ పాడిన సూపర్ హిట్స్ చాలానే ఉంది. మంగ్లీ ఎంట్రీతో చాలా మంది స్టార్ సింగర్స్ సర్దుకున్నారు. పాపులారిటీ వచ్చాక మంగ్లీ యాక్టర్ కూడా అయ్యింది. స్వేచ్ఛ టైటిల్ తో లేడీ ఓరియెంట్ మూవీ చేసింది. అలాగే నితిన్ మ్యాస్ట్రో చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేసింది.
కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉండగా మంగ్లీ వివాహం చేసుకుంటున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అబ్బాయి కూడా అయిన వాడే అట. బావ వరుసయ్యే వ్యక్తితో మూడు ముళ్ల బంధంలో అడుగుపెట్టనుందట. ఈ వార్తలో నిజమెంతో తెలియదు కానీ ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో కూడా మంగ్లీ మీద ఇలాంటి పుకార్లు వినిపించాయి. మంగ్లీ సామాజిక సేవ కూడా చేస్తుంది. తాను పుట్టి పెరిగిన ఊరి అభివృద్ధికి కృషి చేస్తుంది.