https://oktelugu.com/

Star Senior Heroines : సత్తా చాటుతున్న స్టార్ సీనియర్ హీరోయిన్ లు.. ఎవరో తెలుసా?

ఇక జవాన్ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగింది. ఇప్పుడు ఈమె చేతిలో హిందీ, తమిళం, కన్నడ అంటూ చాలా ఆఫర్లు ఉన్నాయట. అన్ని భాషల్లో ఏక చక్రాధిపత్యం వహిస్తూ తిరుగులేని హీరోయిన్ గా సాగుతుంది ఈ అమ్మడు. ఇలా ఇద్దరు కూడా సీనియర్లుగా ఉంటూనే ప్రస్తుతం తన సత్తా చాటుతున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : March 13, 2024 / 12:44 PM IST
    Follow us on

    Star Senior Heroines : కెరీర్ తొలినాళ్లలో కొందరికి చాలా ఈజీ. కానీ ఆ తర్వాతే చాలా కష్టం. అదేనండి సీనియర్ గా ఎదిగిన తర్వాత సినిమాల ఎంపిక. కొత్త హీరోయిన్ లతో పోటీ పడుతూ తన స్టార్ డమ్ ను కాపాడుకోవడం వంటివి కత్తిమీద సాము లాంటివి. ఇక సీనియర్స్ గా మారిన తర్వాత అదే రేంజ్ లో స్టార్ డమ్ ను నిలబెట్టుకోవాలంటే చాలా కష్టపడాల్సిందే. ఇక సినిమా కోసం మాత్రమే కాదు వ్యక్తిగత జీవితంలో కూడా ఫిట్ నెస్ పై ఫోకస్ చేయాల్సిందే. ఫిట్నెస్ లేకపోతే ఇంట బయట వారికి కష్టమే.

    జ్యోతిక, ప్రియమణిలు ఇద్దరు కూడా సీనియర్ హీరోయిన్స్. ఈ ఇద్దరిని కూడా సూపర్ సీనియర్ హీరోయిన్స్ గా పరిగణించవచ్చు. ఇద్దరు కూడా పెళ్లిల్లు చేసుకొని ఆ తర్వాత మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేసి తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే రేంజ్ లో సక్సెస్ ను సాధిస్తున్నారు ఈ హీరోయిన్ లు. మామూలుగా వీరి గురించి చెప్పాల్సిన అవసరం లేకున్నా.. 2024లో వీరి హిట్స్ లను చూస్తే ఏ రేంజ్ లో కష్టపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. 15 సంవత్సరాల క్రితం నటించిన జ్యోతిక మళ్లీ 2023లో రీ ఎంట్రీ ఇచ్చింది.

    రీసెంట్ గా రీ ఎంట్రీ ఇచ్చిన తన స్టార్ డమ్ చెక్కుచెదరలేదు అనడానికి ఆమె సినిమాల హిట్ లే కారణం. కాదల్ ది కోర్ అనే సినిమాలో ముమ్మట్టి సరసన నటించి సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. అదే జోరును 2024లో కూడా కంటిన్యూ చేస్తోంది. సైతాన్ అనే పేరుతో హిందీలో కూడా నటించింది జ్యోతిక. ఒక సినిమానే కాదు హిందీలో వరుస ఆఫర్లు వస్తున్నాయట. ఇక మలయాళంలో కూడా బిజీ హీరోయిన్ గా మారింది ఈ సీనియర్ బ్యూటీ. ఒకవైపు ప్రొడ్యూసర్, మరోవైపు హీరోయిన్ గా తన సత్తా చాటుతుంది.

    సీనియర్ హీరోయిన్ ప్రియమణి కూడా తన సత్తా చాటుతోంది. భామాకలాపంలో మెయిన్ లీడ్ పాత్రలో నటించి మంచి విజయం సాధించింది. దీనికి సీక్వెల్ ను కూడా విడుదల చేశారు మేకర్స్. ఈ సిరీస్ కూడా మంచి విజయం అందుకుంది. దీని తర్వాత ఆర్టికల్ 370 నటించి మరో హిట్ ను అందుకుంది. ఇక జవాన్ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగింది. ఇప్పుడు ఈమె చేతిలో హిందీ, తమిళం, కన్నడ అంటూ చాలా ఆఫర్లు ఉన్నాయట. అన్ని భాషల్లో ఏక చక్రాధిపత్యం వహిస్తూ తిరుగులేని హీరోయిన్ గా సాగుతుంది ఈ అమ్మడు. ఇలా ఇద్దరు కూడా సీనియర్లుగా ఉంటూనే ప్రస్తుతం తన సత్తా చాటుతున్నారు.