Hyderabad Drug Case: దేశంలోని ప్రముఖ నగరాల్లో డ్రగ్స్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. క్లబ్బులు, పబ్బులు అనే తేడా లేకుండా ప్రతీచోట డ్రగ్స్ విచ్చలవిడిగా లభిస్తుండటంతో యువత వీటికి బాగా అలవాటు పడుతున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు నిఘా పెంచుతున్నప్పటకీ డ్రగ్స్ ముఠా సభ్యులు గుట్టుచప్పుడు కాకుండా కస్టమర్లకు వాటిని సరఫరా చేస్తుండటంతో ఈ దందాకు అడ్డకట్ట పడటం లేదు.
ఈ డ్రగ్స్ కల్చర్ కు ఎక్కువగా ధనవంతులు, ప్రముఖులు, సినిమా స్టార్స్ అలవాటు పడుతున్నారని తెలుస్తోంది. ఈక్రమంలోనే బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా డ్రగ్స్ దందాకు సంబంధించిన కేసులు ఇటీవల కాలంలో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. మీడియాలో ఈ డ్రగ్స్ వ్యవహారం కొన్ని రోజులు హైలెట్ అయి తర్వాత సర్దుమణిగిపోవడం కూడా కామన్ అయిపోయింది.
గతంలో బాలీవుడ్, టాలీవుడ్ కేంద్రంగా వెలుగు చూసిన డ్రగ్స్ కేసులు ఇలానే కనుమరుగయ్యాయి. అయితే తాజాగా హైదరాబాద్ పోలీసులు ముంబైలో డ్రగ్స్ ముఠాను అరెస్టు చేశారు. పక్కా సమాచారం మేరకు దాడి చేసి భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై సెక్షన్ 27 ప్రకారంగా పోలీసులు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
ఈ దాడిలో మొత్తంగా 30 మంది ప్రముఖులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సినిమా, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులతోపాటు వారి పిల్లలు సైతం డ్రగ్స్ కు వాడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ కేసులో ప్రముఖుల పిల్లలు ఇరుక్కుపోవడంతో ఈ కేసు కీలక ములుపు తిరిగే అవకాశం ఉందనుంది.
దీంతో గతంలో వెలుగుచూసిన డ్రగ్స్ కేసుల మాదిరిగానే ఈ కేసు కూడా మూలనపడే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ముంబై నుంచి దేశ వ్యాప్తంగా పలు నగరాలకు డ్రగ్స్ సరఫరా అవుతుందని పోలీసులు గుర్తించారు. మరీ డ్రగ్స్ రాకెట్ కు పోలీసులు ఎప్పుడు చెక్ పెడుతారనేది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.