https://oktelugu.com/

Manchu Lakshmi: మంచు లక్ష్మి అసలు తగ్గడం లేదు… దేని కోసమో ఈ ఆరాటం!

అనగనగా ఓ ధీరుడు చిత్రంతో మంచు లక్ష్మి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. సిద్దార్థ్-శృతి హాసన్ జంటగా నటించగా... మంచు లక్ష్మి విలన్ రోల్ చేయడం విశేషం.

Written By:
  • Shiva
  • , Updated On : October 7, 2023 / 10:08 AM IST
    Follow us on

    Manchu Lakshmi: స్టార్ కిడ్ మంచు లక్ష్మి సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి విషయం షేర్ చేస్తుంది. ఇక వయసుతో సంబంధం లేకుండా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తుంది. మంచు లక్ష్మి కెరీర్ అమెరికాలో స్టార్ట్ చేసింది. అక్కడ కొన్ని టాక్ షోలకు హోస్ట్ గా వ్యవహరించింది. రెండు మూడు ఇంగ్లీష్ సినిమాలు కూడా చేసింది. అందుకే నేను హాలీవుడ్ లో ఉంటే ఎక్కడికో వెళ్లిపోయేదాన్ని అంటుంది. మరి ఆమె టాలీవుడ్ కి ఎందుకు వచ్చారో తెలియదు.

    అనగనగా ఓ ధీరుడు చిత్రంతో మంచు లక్ష్మి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. సిద్దార్థ్-శృతి హాసన్ జంటగా నటించగా… మంచు లక్ష్మి విలన్ రోల్ చేయడం విశేషం. ఆమె మంత్రగత్తె పాత్రలో మైండ్ బ్లాక్ చేసింది. ఆ సినిమా డిజాస్టర్. అక్కడ మొదలైన ఆమె పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. గుండెల్లో గోదారి, దొంగాట, వైఫ్ ఆఫ్ రామ్ చిత్రాల్లో మంచు లక్ష్మి హీరోయిన్ గా నటించింది.

    ఒక్క చిత్రం కూడా ఆడలేదు. ఆమెకు కనీస ఇమేజ్ దగ్గలేదు. అయినా తన ప్రయత్నం ఆపలేదు. హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే ఉంది. ఆమె లీడ్ రోల్ చేసిన అగ్ని నక్షత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రీ ప్రొడక్షన్ కూడా పూర్తి అయినట్లు సమాచారం. మరి ఎందుకో ఆ చిత్ర విడుదలపై మంచు లక్ష్మి ఫోకస్ పెట్టడం లేదు. ఎలాంటి ప్రొమోషన్స్ చేయడం లేదు. ఈ మూవీలో మోహన్ బాబు సైతం కీలక రోల్ చేశారట.

    మరోవైపు మంచు ఫ్యామిలీలో విభేదాలు కొనసాగుతున్నాయి. మోహన్ బాబు ముగ్గురు పిల్లలు రెండు వర్గాలు అయ్యారు. విష్ణు ఒకవైపు మంచు లక్ష్మి, మనోజ్ మరోవైపు చేరారు. విష్ణు మోహన్ బాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆస్తి పంపకాల్లో విబేధాలు తలెత్తాయనే వాదన వినిపిస్తుంది. ఇటీవల మనోజ్ రెండో పెళ్లి చేసుకోగా మంచు లక్ష్మి మాత్రమే ఈ పెళ్లి బాధ్యత తీసుకుంది. విష్ణు-మనోజ్ గొడవపడుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే….