https://oktelugu.com/

Varalaxmi Sarathkumar: అఫీషియల్ : బాలయ్యకి విలన్ గా స్టార్ హీరో కుమార్తె !

Varalaxmi Sarathkumar: నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో తన 107వ సినిమాని భారీ స్థాయిలో చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో బాలయ్యకు విలన్ గా కన్నడ విలక్షణ నటుడు దునియా విజయ్ నటించబోతున్నాడని చిత్రబృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. కన్నడంలో దునియా సినిమాతో బాగా పాపులరయ్యాడు ఈ దునియా విజయ్. అయితే, తాజాగా చిత్రబృందం మరో సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమాలో మరో ఒకప్పటి స్టార్ శరత్ కుమార్ […]

Written By:
  • Shiva
  • , Updated On : January 5, 2022 / 10:56 AM IST
    Follow us on

    Varalaxmi Sarathkumar: నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో తన 107వ సినిమాని భారీ స్థాయిలో చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో బాలయ్యకు విలన్ గా కన్నడ విలక్షణ నటుడు దునియా విజయ్ నటించబోతున్నాడని చిత్రబృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. కన్నడంలో దునియా సినిమాతో బాగా పాపులరయ్యాడు ఈ దునియా విజయ్. అయితే, తాజాగా చిత్రబృందం మరో సర్ ప్రైజ్ ఇచ్చింది.

    Varalaxmi Sarathkumar

    ఈ సినిమాలో మరో ఒకప్పటి స్టార్ శరత్ కుమార్ కుమార్తె ‘పవర్‌ ఫుల్ పెర్‌ ఫార్మర్’ వరలక్ష్మి శరత్‌కుమార్ ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది. ఈ విషయాన్ని చిత్రబృందం పోస్టర్ రిలీజ్ చేస్తూ అధికారికంగా ప్రకటించింది. వరలక్ష్మి శరత్‌కుమార్ లేడీ విలన్ గా నటించబోతుందని.. సినిమాలో ఆమె పాత్ర చాలా వైలెంట్ గా ఉంటుందని తెలుస్తోంది. మరి బాలయ్య – వరలక్ష్మి శరత్‌కుమార్ మధ్య సన్నివేశాలు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.

    కాగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అందాల సుందరి శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఈ మాస్ ఎంటర్‌టైనర్‌కు సంగీతం అందించడానికి థమన్ ఎస్ సిద్ధంగా ఉన్నాడు. అన్నట్టు ఈ సినిమా షూటింగ్ డేట్స్ ను కూడా ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 07 నుంచి ఫస్ట్ షెడ్యూల్ ను స్టార్ చేయనున్నారు.

    Also Read: ‘బిగ్ బాస్’ హోస్ట్ గా బాలయ్య : ఏ హీరో ఎలాంటి షో చేయాలంటే ?

    ఈ సినిమా కోసం గోపీచంద్ మలినేని స్క్రిప్ట్ లో బాగానే కసరత్తులు చేశాడు. ముఖ్యంగా బాలయ్య గెటప్ పై బాగా వర్క్ చేస్తున్నాడు. ఈ సినిమా కథ మొత్తం రాయలసీమ – కర్ణాటక బోర్డర్ నేపథ్యంలో జరుగుతుందని.. కథలో రాయలసీమకు చెందిన ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావించ బోతున్నారట. పైగా ఈ సినిమాలో బాలయ్య మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడు.

    ఇక ‘అఖండ’ తర్వాత బాలయ్య రేంజ్ మారిపోయింది. అందుకే ఈ సినిమా బడ్జెట్ విషయంలో కూడా మరో 30 కోట్లు పెరిగినట్లు తెలుస్తోంది. ఏపీలో టికెట్ రేట్లును దారుణంగా తగ్గించినా బాలయ్య వంద కోట్ల మార్క్ ను దాటాడు. కాబట్టి.. బాలయ్యకి కరెక్ట్ సినిమా పడితే 150 కోట్లు వసూళ్లు చేసే స్టామినా ఉందని మేకర్స్ నమ్ముతున్నారు.

    Also Read: బాలయ్యకి విలన్ వచ్చాడు, డేట్లు ఫిక్స్ అయ్యాయి !

    Tags