Homeఎంటర్టైన్మెంట్Neelambari Character In Narasimha Movie: నరసింహ సినిమాలో నీలాంబరి పాత్రని వదులుకున్న స్టార్ హీరోయిన్స్...

Neelambari Character In Narasimha Movie: నరసింహ సినిమాలో నీలాంబరి పాత్రని వదులుకున్న స్టార్ హీరోయిన్స్ ఎవరో తెలుసా??

Neelambari Character In Narasimha Movie: సూపర్ స్టార్ రజిని కాంత్ కెరీర్ లో నరసింహ అనే సినిమా ఎలాంటి సంచలన విజయం సాధించిందో మన అందరికి తెలిసిందే..తమిళ్ లో ఈ సినిమా ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో మన తెలుగు లో కూడా అదే రేంజ్ లో సెన్సేషన్ సృష్టించింది..ఈ సినిమాలో రజినీకాంత్ కి ఎలాంటి పేరు ప్రఖ్యాతలు వచ్చాయో..ఆయన తర్వాత అదే స్థాయి పేరు ప్రఖ్యాతలు సంపాదించింది ఈ సినిమాలో విలన్ గా నటించిన రమ్య కృష్ణ..ఆమె పోషించిన నీలాంబరి పాత్ర లేడీ విలన్ రోల్స్ కి రోల్ మోడల్ గా నిలిచింది..హీరోయిన్ గా కెరీర్ పీక్ స్టేజి లో ఉన్నప్పుడు ఆమె ఇలాంటి రోల్ ని అంగీకరించి రజినీకాంత్ తో పోరి పది నటించడం అంటే మాములు విషయం కాదు అనే చెప్పాలి..రమ్యకృష్ణ కనబర్చిన అద్భుతమైన నటనని సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో సార్లు ప్రత్యేకంగా ప్రశంసించారు అట..అయితే ఈ పాత్ర ని రమ్య కృష్ణ తో వేయించే ముందు ఆ చిత్ర దర్శకుడు KS రవి కుమార్ చాలా మంది స్టార్ హీరోయిన్స్ ని సంప్రదించాడు అట..దానికి సంబంధించిన వివరాలు అన్నీ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Neelambari Character In Narasimha Movie
Ramya Krishna

Also Read: How to Abolish Caste System : కుల వ్యవస్థ పోవాలంటే ఏం చేయాలి?

తొలుత ఈ పాత్ర కోసం నగ్మా గారిని అనుకున్నారట ఆ చిత్ర దర్శకుడు రవి కుమార్..ఆమె డేట్స్ కోసం అప్పట్లో ఆయన చాలా కష్టపడ్డాడు..మొత్తానికి ఆమెని కలిసి స్టోరీ వినిపించగా ఆమెకి ఆ పాత్ర ఎంతో నచినప్పటికీ కూడా కాల్ షీట్స్ ని సర్దుబాటు చెయ్యలేక ఈ సినిమాని అయిష్టంతోనే వదులుకోవాల్సి వచ్చింది..ఇక ఆమె తర్వాత అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఒక్క వెలుగు వెలుగుతున్న హీరోయిన్ మీనా ని అడిగారట..ఆమెకి ఆ పాత్ర నచినప్పటికీ కూడా తన తల్లికి నచ్చకపోవడం తో వదులుకోవాల్సి వచ్చింది..అప్పట్లో మీనా ఒక్క సినిమా స్టోరీ ని ఓకే చెయ్యాలి అంటే వాళ్ళ అమ్మగారు కూడా ఆ స్టోరీ విని, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే సినిమాలకు సైన్ చేసేవారట..ఎంతో సున్నితంగా కనిపించే తన కూతురు ముఖం విలన్ రోల్స్ కి పనికి రాదు అని వాళ్ళ అమ్మగారు అప్పట్లో ఒప్పుకోలేదు అట..ఇక చివరికి రమ్య కృష్ణ గారి కాల్ షీట్స్ అందుబాటులో ఉండడం తో ఆమెకి స్టోరీ చెప్పగానే వెంటనే ఒప్పేసుకొని ఈ సినిమా చేసేసింది..ఇక తర్వాత హిస్టరీ మన అందరికి తెలిసిందే..నీలాంబరి పాత్రని తానూ తప్ప మరెవ్వరు చెయ్యలేరు అనే విధంగా రమ్యకృష్ణ ఈ సినిమా నట విశ్వరూపం చూపించి చిరస్థాయి గా ఆ పాత్రని ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయ్యేలా చేసింది.

Neelambari Character In Narasimha Movie
Meena, Nagma

Also Read: Getup Srinu- Mukku Avinash: గెటప్ శ్రీనుకు జబర్దస్త్ కి అందుకే గ్యాప్ వచ్చింది… అసలు విషయం చెప్పిన ముక్కు అవినాష్
Recomended Videos

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular