Star Heroines: ఇండియాలో సినిమా, క్రికెట్, పాలిటిక్స్ ఈ మూడింటికి చాలా క్రేజ్ ఉంటుంది. ఈ మూడింటి ద్వారా సెలబ్రిటీ హోదాని అనుభవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక అందులో ముఖ్యంగా జనాల మీద సినిమా ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి. ఇక సినిమా హీరోలు రాజకీయ పార్టీలు పెట్టి సీఎంలు అయిన చరిత్రలు కూడా ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లు ఎక్కువగా క్రికెటర్లని అభిమానిస్తూ ఉంటారు. వీలైతే వారిని ప్రేమిస్తూ కూడా ఉంటారు.
ఇక మరి కొంతమంది హీరోయిన్లు క్రికెటర్లను ప్రేమించి పెళ్లిళ్లు చేసుకున్న విషయం కూడా మనకు తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు నగ్మా లాంటి స్టార్ హీరోయిన్ గంగూలీని ప్రేమించింది. అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ చివరి నిమిషంలో గంగూలీ తో బ్రేకప్ అవడంతో ఆయన వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు. ఇక ఇప్పటికి నగ్మా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటుంది.
ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన సారిక కూడా ఇండియన్ టీమ్ దిగ్గజ కెప్టెన్ అయిన కపిల్ దేవ్ ను ప్రేమించింది. దాంతో ఆయనకూడా ఆమెను ప్రేమించాడు. ఇద్దరు చట్టాపట్టాలేసుకొని తిరుగుతూ ఉండేవాడు. తన ఫ్యామిలీకి కూడా సారికను పరిచయం చేశాడు. ఇక వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారు అని అందరూ అనుకున్న సమయంలో వీళ్ల మధ్య చిన్న గొడవలు వచ్చి బ్రేకప్ అయ్యింది. దాంతో కపిల్ దేవ్ వేరే వాళ్ళని పెళ్లి చేసుకోగా, సారిక కమలహాసన్ ని పెళ్లి చేసుకుంది. ఇక ఆమెకు శృతిహాసన్, అక్షర హాసన్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు…ఇలా సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోయిన్స్ క్రికెటర్లని ప్రేమిస్తూ ఉంటారు…
ఇక ప్రపంచం లో నెంబర్ వన్ కెప్టెన్ గా గుర్తింపు పొందిన మహేంద్ర సింగ్ ధోని దీపిక పదుకునే ఇద్దరు ప్రేమించుకున్న విషయం కూడా మనకు తెలిసిందే. ఇక అప్పట్లో ఇద్దరు చట్టపట్టాలేసుకొని తిరుగుతున్నారని చాలా వార్తలు కూడా వచ్చాయి. కానీ చివరి నిమిషంలో ఇద్దరి మధ్య బ్రేకప్ అవడంతో ధోని సాక్షిని పెళ్లి చేసుకున్నాడు. దాంతో దీపిక కూడా రణ్ వీర్ సింగ్ ను పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయింది…