https://oktelugu.com/

Jr NTR : ఎన్టీఆర్ తో 7 సినిమాలు వదులుకున్న స్టార్ హీరోయిన్… షాకింగ్ కారణం

ఎన్టీఆర్ వెయిట్ తగ్గిన తర్వాత కూడా మేకర్స్ వీరి కాంబినేషన్ సెట్ చేయాలని అనుకున్నారు కానీ అవేమి సెట్ కాలేదు.

Written By:
  • NARESH
  • , Updated On : September 25, 2023 / 07:06 PM IST

    ntr

    Follow us on

    Jr NTR : టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ నటుల జాబితా తీస్తే అందులో ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ పేరు ఉంటుంది. ఎలాంటి పాత్ర అయిన అలవోకగా చేయగలిగిన సత్తా ఉన్న నటుడు అతడు. నందమూరి నట వారసుడిగా సినీ ప్రవేశం చేసి, ఆ కుటుంబ లెగసిని ముందుకు తీసుకెళ్తున్న తారక్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. త్రిబుల్ ఆర్ సినిమా తో పాన్ వరల్డ్ స్టార్ గా ఎదిగిన ఎన్టీఆర్ సరసన నటించాలనే కోరిక ప్రతి హీరోయిన్ కి ఉంటుంది.

    అలాంటి ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం వచ్చిన కానీ వద్దు అనేసింది ఒక హీరోయిన్. అది కూడా దాదాపు ఏడు సార్లు వచ్చిన అవకాశాలను రిజెక్ట్ చేసింది ఆమె. ఆ హీరోయిన్ మరెవరో కాదు సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై , అరుంధతి తో ఆకట్టుకొని, దేవసేన గా అందరి మన్ననలు పొందిన అనుష్క . నిజమే మీరు విన్నది ఎన్టీఆర్ సరసన నటించే అవకాశాలు ఎన్ని వచ్చిన కానీ వాటికి నో చెప్పింది ఈ భామ.

    ఇప్పుడయితే ఎన్టీఆర్ ఫిజిక్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది కానీ, నరసింహుడు, నా అల్లుడు , రాఖీ సినిమాల సమయంలో ఓవర్ వెయిట్ ఉండేవాడు. కేవలం తన నటన , డాన్స్ లతో ప్రేక్షకులను మెప్పించే వాడు. ఆ సమయంలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్స్ కొరత ఉండేది. ఆ సమయంలో అనేక మంది దర్శకులు అనుష్క ను కలిసి కథ చెప్పి , ఎన్టీఆర్ హీరో అని చెప్పగానే “నో” చెప్పేదని ఒక టాక్ ఉంది. బహుశా ఎన్టీఆర్ సరసన సెట్ కాదేమో అనేసి ఆమె నో చెప్పినట్లు తెలుస్తోంది.

    ఆ తర్వాత ఎన్టీఆర్ వెయిట్ తగ్గిన తర్వాత కూడా మేకర్స్ వీరి కాంబినేషన్ సెట్ చేయాలని అనుకున్నారు కానీ అవేమి సెట్ కాలేదు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ క్రేజ్ కు అనుష్క హీరోయిన్ గా సెట్ కాదనే చెప్పాలి. గతంలో వీరిద్దరూ కలిసి వెంకటేష్ సినిమా చింతకాయల రవి సినిమాలో ఒక పాటలో రెండు నిమిషాలు కనిపించి సందడి చేశారు. ఆ ఒక్క పాటలో తప్ప వీరి జోడి ఇంకెప్పుడు తెర మీద కనిపించలేదు.