https://oktelugu.com/

Yamudu movie : యముడు సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్…

ఇక దాంతో సూర్య సరసన యముడు సినిమాలో నటించి ఉంటే బాగుండేదని కాజల్ ఎప్పుడు తన సన్నిహితుల దగ్గర చెప్పేదట...ఇక మొత్తానికైతే సూర్య అనుష్క కాంబినేషన్ లో వచ్చిన యముడు సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించి వాళ్ళిద్దరికీ మంచి మార్కెట్ ను కూడా ఏర్పాటు చేసింది అనే చెప్పాలి...

Written By:
  • NARESH
  • , Updated On : March 12, 2024 / 11:18 PM IST

    Star Heroine who missed Yamudu movie...

    Follow us on

    Yamudu movie : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు హరి… ఆయన చేసిన సినిమాలు కమర్షియల్ గా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. ఇక ప్రేక్షకులు నాడీ తెలిసిన దర్శకుడి గా కూడా అతన్ని పిలుస్తూ ఉంటారు. ఇక ఆయన ముఖ్యంగా విక్రమ్ హీరోగా ‘స్వామి ‘ అనే సినిమా చేసి సూపర్ హిట్ ను అందుకున్నారు. ఇక ఈ సినిమాతో ఒకసారి గా స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక ఇది ఇలా ఉంటే హరి డైరెక్షన్ లో సూర్య హీరోగా వచ్చిన ‘యముడు ‘ మూవీ మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అనుష్క నటించిన విషయం మనకు తెలిసిందే.

    అయితే ఈ సినిమాలో అనుష్క కంటే ముందే దర్శకుడు వేరే ఒక హీరోయిన్ ను తీసుకోవాలనే ప్రయత్నం చేశారట, కానీ ఆమెకు ఆ పాత్ర నచ్చకపోవడంతో ఆమె ఆ సినిమాను చేయనని చెప్పేసిందట. అయితే ఇప్పుడు ఆ హీరోయిన్ ఎవరు అనే విషయం మీద సోషల్ మీడియాలో పలు రకాల కథనాలు అయితే వెలువడుతున్నాయి. హరి ఈ సినిమా కోసం మొదట హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ని తీసుకోవాలని అనుకున్నారట. కానీ ఆమె ఆ క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయడంతో ఆ పాత్రలోకి అనుష్క ను తీసుకున్నారు. ఇక ఈ సినిమా అప్పట్లో తెలుగు, తమిళం రెండు భాషల్లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.

    దాంతో అనుష్క ఖాతాలో మరొక సక్సెస్ వచ్చి పడింది. ఇక ఈ సినిమాని మిస్ చేసుకున్నందుకు కాజల్ అగర్వాల్ చాలా రోజులు బాధపడినట్టుగా చాలా కథనాలు అయితే వెలువడ్డాయి. ఇక మొత్తానికైతే సూర్యతో కాజల్ ఒక మంచి సినిమాను మిస్ చేసుకుందనే చెప్పాలి. ఇక ఈ సినిమా మిస్ అయిన కూడా సూర్యతో బ్రదర్స్ అనే సినిమాలో కాజల్ అగర్వాల్ నటించింది. అయినప్పటికీ ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు.

    ఇక దాంతో సూర్య సరసన యముడు సినిమాలో నటించి ఉంటే బాగుండేదని కాజల్ ఎప్పుడు తన సన్నిహితుల దగ్గర చెప్పేదట…ఇక మొత్తానికైతే సూర్య అనుష్క కాంబినేషన్ లో వచ్చిన యముడు సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించి వాళ్ళిద్దరికీ మంచి మార్కెట్ ను కూడా ఏర్పాటు చేసింది అనే చెప్పాలి…