Shweta Tiwari : సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. అలాంటి సినిమా ఇండస్ట్రీలో ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం ఇక ఆ తర్వాత విడిపోవడం సాధారణం అని చెప్పచ్చు. హీరో, హీరోయిన్ ప్రేమించి పెళ్లి చేసుకోవడం లేదా హీరోయిన్ మరొకరిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం చాలానే చూసి ఉంటారు. ఇప్పుడు చెప్పబోయే ఈ హీరోయిన్ కూడా ఈ కోవకు చెందిన హీరోయిన్ అని చెప్పచ్చు. ఈమె స్టార్ హీరో కు జోడిగా నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఈమె సంపాదన కోట్లలో ఉన్న వ్యక్తిగత జీవితం మాత్రం అనుకున్నట్లు లేదని చెప్పచ్చు. అయితే ఈమె ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. 12 ఏళ్ళ అతి చిన్న వయస్సు లోనే సినిమా ఇండస్ట్రీ లో అడుగు పెట్టి చిన్న చిన్న పాత్రలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఈమె 18 ఏళ్ళ చిన్న వయస్సులోనే పెళ్లి కూడా చేసుకుంది. ఇక 20 ఏళ్లకే ఈమెకు ఇద్దరు పిల్లలు. కాగా అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈమె ఎవరో కాదు శ్వేతా తివారి. బుల్లితెర మీద ఒకప్పుడు బాగా పాపులర్ అయిన సీరియల్ కసౌతీ జిందగీ కి లో ఈమె ప్రధాన పాత్రలో నటించింది. ప్రేరణ శర్మ పాత్రలో నటించి తనకంటూ చెరగని ముద్ర వేసుకుంది.కేవలం 12 ఏళ్ళ అతి చిన్న వయస్సులో ఇండస్ట్రీలో అడుగు పెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. తన కెరీర్ ను చిన్న వయస్సులో భోజ్ పూరి చిత్రాలలో ప్రారంభించింది.

ఇక ఆ తర్వాత సీరియల్స్ లో, బాలీవుడ్ చిత్రాలలో నటించి నటిగా మంచి క్రేజ్ తెచ్చుకుంది. శ్వేతా తివారి భోజ్ పూరి సినిమా ఇండస్ట్రీ లో పని చేస్తున్న సమయం లోనే ఆమెకు రాజా చౌదరి తో స్నేహం ఏర్పడింది. ఇక ఆ స్నేహం కాస్త ప్రేమ గా మారి పెళ్లి వరకు వెళ్ళింది. శ్వేతా తివారి తన కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్లి రాజా చౌదరి ని పెళ్లి చేసుకుంది. పెళ్లి సమయంలో ఆమె వయస్సు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే. ఇక పెళ్ళైన తర్వాత 20 సంవత్సరాల వయస్సులో ఆమె ఒక కూతురుకు జన్మనిచ్చింది. పాలక్ తివారి పుట్టిన తర్వాత ఈమె తన భర్త నుంచి విడిపోవడం జరిగింది.

విడాకులు తీసుకున్న చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈమె ప్రేమలో పడింది. శ్వేతా తివారి 2013 అభినవ్ కోహ్లీ ని రెండో పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి తర్వాత ఈమె ఒక కుమారుడికి జన్మనిచ్చింది. కానీ పెళ్లి అయిన ఆరు సంవత్సరాల తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకోని విడిపోయారు. ఇప్పుడు ప్రస్తుతం శ్వేతా తివారి తన కూతురు పాలక్ తివారి మరియు కొడుకు రెయాన్ష్ కోహ్లీ తో ఒంటరిగా జీవితం గడుపుతుంది. ఈమె రోహిత్ శెట్టి వెబ్ సిరీస్ ఇండియన్ పోలీస్ ఫోర్స్ లో చివరి సారిగా కనిపించింది. ప్రస్తుతం శ్వేతా తివారి సింగం అగైన్ చిత్రం లో నటిస్తుంది.