Rashmika Mandanna: స్టార్ హీరోయిన్ రష్మిక మందనా రెడ్ చోళీ లెహంగా ధరించి సూపర్ గ్లామరస్ ఫోజులిచ్చారు. దుప్పట్టా పక్కకు విసిరేసి యద అందాల విందు చేసింది. రష్మిక లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.చాలా తక్కువ టైంలో రష్మిక స్టార్ హీరోయిన్ అయ్యారు. వరుస విజయాలు ఆమె ఇమేజ్ పెంచేశాయి. ఛలో మూవీతో టాలీవుడ్ కి పరిచయమైన రష్మిక సూపర్ హిట్ అందుకున్నారు. గీత గోవిందంతో రష్మిక స్టార్డం సొంతం చేసుకుంది. విజయ్ దేవరకొండ-రష్మిక జంటగా నటించిన గీత గోవిందం డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నిర్మాతలకు ఊహించని లాభాలు తెచ్చిపెట్టింది.

అక్కడ నుండి రష్మిక వెనక్కి తిరిగి చూసుకోలేదు. వెంటనే మహేష్ వంటి టాప్ స్టార్ తో జతకట్టే ఛాన్స్ కొట్టేసింది. సరిలేరు నీకెవ్వరు మూవీ 2020 సంక్రాంతి కానుకగా విడుదలై బంపర్ హిట్ కొట్టింది. ప్రస్తుతం రష్మిక హీరోయిన్ గా మూడు బడా ప్రాజెక్ట్స్ తెరకెక్కుతున్నాయి. సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప 2 లో రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

అలాగే దళపతి విజయ్ కి జంటగా వారసుడు మూవీ చేస్తున్నారు. ఈ మూవీ 2023 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. దిల్ రాజు నిర్మాణంలో దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నారు. వారసుడు సంక్రాంతి విడుదలపై సందిగ్ధత నెలకొంది. తెలుగు నిర్మాతల మండలి వారసుడు తమిళ డబ్బింగ్ మూవీ సంక్రాంతికి విడుదల చేయడానికి వీలు చేకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని తమిళ దర్శకులు, నిర్మాతలు వ్యతిరేకిస్తున్నారు.

వీటితో పాటు రన్బీర్ కపూర్-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యానిమల్ మూవీలో రష్మిక హీరోయిన్ గా నటిస్తున్నారు. కెరీర్ సూపర్ సక్సెస్ ఫుల్ గా సాగిపోతుండగా… సోషల్ మీడియా నెగిటివిటీ ఇబ్బంది పెడుతుందని రష్మీ ఆవేదన చెందుతున్నారు. ఈ విషయంపై ఇటీవల రష్మిక స్పందించారు. ట్రోల్స్, రూమర్స్ తనతో పాటు కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతున్నాయని ఆవేదన చెందారు. ఇకపై టోలరేట్ చేయనని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. విజయ్ దేవరకొండతో ఆమె ఎఫైర్ నడుపుతున్నట్లు తరచుగా వార్తలు వస్తున్నాయి.