Homeఎంటర్టైన్మెంట్Rakul Preet Singh: పలుచని డ్రెస్ లో కవ్వించే రకుల్ ప్రీత్ అందాలు... స్టార్ హీరోయిన్...

Rakul Preet Singh: పలుచని డ్రెస్ లో కవ్వించే రకుల్ ప్రీత్ అందాలు… స్టార్ హీరోయిన్ గ్లామరస్ ఫోటోలు వైరల్

Rakul Preet Singh: స్టార్ లేడీ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి సిద్ధం అవుతుంది. ప్రియుడు జాకీ భగ్నానీ తో ఆమె వివాహం జరగనుంది. 2021లో రకుల్ ప్రీత్ తన ప్రేమ విషయం వెల్లడించింది. బర్త్ డే నాడు ప్రియుడిని పరిచయం చేసింది. బాలీవుడ్ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీని ప్రేమిస్తున్నట్లు రకుల్ ప్రీత్ సింగ్ అధికారికంగా ప్రకటించారు. ప్రియుడిని పరిచయం చేసిన నాటి నుండి రకుల్ కి పెళ్లి ప్రశ్న ఎక్కువైంది. ఎక్కడికెళ్లినా మీడియా వాళ్ళు జాకీతో మీ వివాహం ఎప్పుడు అని అడిగేవారు. విసిగిపోయిన రకుల్ అసహనం వ్యక్తం చేశారు.

ఫైనల్లీ రకుల్ కి పెళ్లి కళ వచ్చేసింది. త్వరలో గోవా లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. డేట్ కూడా ఫిక్స్ కాగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బంధుమిత్రులు, సన్నిహితుల మధ్య ఘనంగా జాకీ-రకుల్ పెళ్లి జరగనుంది. ఒకవైపు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న రకుల్ సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ పోస్ట్ చేయడం మరవడం లేదు. తాజాగా ట్రాన్స్పరెంట్ డ్రెస్ లో గ్లామర్ షో చేసింది. అమ్మడు హాట్ లుక్ చూసి ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు.

అదే సమయంలో బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ పరిశ్రమకు వచ్చి చాలా కాలం అవుతుంది. తెలుగులో ఆమె స్టార్ హీరోయిన్ హోదా అనుభవించింది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీతో రకుల్ కి బ్రేక్ వచ్చింది. తెలుగులో పవన్ కళ్యాణ్, ప్రభాస్ మినహాయిస్తే.. టాప్ స్టార్స్ అందరితో రకుల్ సినిమాలు చేసింది. ఎన్టీఆర్ కి జంటగా నాన్నకు ప్రేమతో, మహేష్ బాబుతో స్పైడర్ చేసింది.

అల్లు అర్జున్ కి జంటగా సరైనోడు చిత్రంలో నటించింది. రామ్ చరణ్-రకుల్ కాంబోలో ధ్రువ విడుదలైంది. టాలీవుడ్ లో ఆఫర్స్ వస్తున్నా బాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది. అక్కడ టైర్ టు హీరోల చిత్రాల్లో ఆమె నటించారు. హిందీ చిత్రాలు చేస్తున్నప్పటికీ ఒక్క హిట్ పడింది లేదు. తెలుగులో రకుల్ నటించిన చివరి చిత్రం కొండపొలం. క్రిష్ దర్శకత్వం వహించగా వైష్ణవ్ తేజ్-రకుల్ జంటగా నటించారు. నెక్స్ట్ ఆమె భారతీయుడు 2లో కనిపించనుంది. మరి పెళ్ళయాక నటిస్తుందో లేదో చూడాలి…

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

RELATED ARTICLES

Most Popular