Nayanthara: నయనతార పెళ్లి.. ఈ వార్త పై గత కొన్ని సంవత్సరాలుగా పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఐతే, ఆ పుకార్లను ఇక నెట్టింట్లో చక్కర్లు కొట్టకుండా మొత్తానికి నయనతార తన ప్రియుడు విగ్నేష్ శివన్ ను వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతుంది అంటూ తాజాగా మరో వార్త వైరల్ అవుతుంది. ఈ స్టార్ కపుల్ నయనతార, విగ్నేష్ శివన్ ఈ రోజు ఉదయం తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా నయనతార అక్కడ ఇన్ డైరెక్ట్ గా మాట్లాడుతూ విగ్నేష్ శివన్ తో నా పెళ్లి త్వరలోనే అంటూ క్లారిటీ ఇచ్చింది. అందుకే ఈ సందర్భంగా తిరుపతికి చేరుకున్న విగ్నేష్ శివన్, నయనతార శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాదాలు అందుకున్నారు. ఏది ఏమైనా, నయన్ పెళ్లి వ్యవహారం పై ఇప్పటివరకు మీడియా హడావుడి చేయడమే తప్ప.. నయనతార నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
Also Read: Shah Rukh Khan: తీవ్ర నిరాశలో నెంబర్ వన్ ‘స్టార్ హీరో’.. కారణం అదే !
దాంతో ఆమె పెళ్లి వచ్చే నెలలో అయినా నిజంగానే జరుగుతుందా ? లేక ఎప్పటిలాగే ఇది కూడా రూమర్ గానే ముగుస్తోందా అంటూ నెటిజన్లు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు నయనతార క్లారిటీ ఇస్తే బాగుంటుంది. కాకపోతే, గతంలో నయనతార ‘స్టార్ విజయ్ టెలివిజన్’ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ఆమె చేసిన కామెంట్స్ మాత్రం ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి.

ఇంతకీ, నయనతార.. తన పెళ్లి గురించి ఏమి మాట్లాడింది అంటే.. తన వేలికి ఉన్న ఉంగరాన్ని చూపించి.. ఇది నా నిశ్చితార్థం రింగే. పెళ్లి కుమారుడు విగ్నేష్ శివనే. మా నిశ్చితార్థానికి కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. అందుకే ఇండస్ట్రీలో కూడా ఎవరికీ మా నిశ్చితార్థం గురించి తెలియదు. నిశ్చితార్ధానికి ఎవర్ని పిలవకపోవడానికి కారణం.. నాకు సంబరాలు చేసుకోవడం, పెద్దగా హడావిడి చేయడం లాంటివి ఇష్టం ఉండవు.
అందుకే మా నిశ్చితార్థ వేడుకను సింపుల్ గా జరువుకున్నాం. ఇక పెళ్ళి కూడా అలాగే చేసుకుంటాం ఏమో’ అంటూ చెప్పుకొచ్చింది నయనతార. ఏది ఏమైనా లేడీ సూపర్ స్టార్ నయనతారకి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉంది. అందుకే ఆమె పెళ్లి ఎప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంది.
Also Read: Regina: తమిళ నిర్మాతల దెబ్బకు టాలీవుడ్ మీద పడ్డ హీరోయిన్
Recommended Videos: