2023 Round Up: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలందరూ వరుసగా సినిమాలను చేస్తూ మంచి ఊపులో ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ 2023 వ సంవత్సరంలో మాత్రం తెలుగు లో చాలా మంది స్టార్ హీరోలు వాళ్ల సినిమాలని రిలీజ్ చేయలేదు. దానికి ఒక్కొక్కరీది ఒక్కో ప్రాబ్లం అయినప్పటికీ ఈ సంవత్సరం మొత్తానికి మన స్టార్ హీరోలు ఎవరు కూడా థియేటర్లోకి రాలేదు. ఈ సంవత్సరం థియేటర్ కి రాకుండా వాళ్ల సినిమాలను పోస్ట్ పోన్ చేసుకున్న హీరోలు ఎవరెవరున్నారు అనేది ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
మహేష్ బాబు
త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరో గా వచ్చిన గుంటూరు కారం సినిమా ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ అయినప్పటికీ ఈ సంవత్సరం రిలీజ్ అవుతుంది అనే ఉద్దేశంతో అందరూ ఉన్నారు. కానీ అది వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వస్తూ మొత్తానికి అయితే 2024 సంక్రాంతి కానుక ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది….
రామ్ చరణ్
ఈ సంవత్సరం రాంచరణ్ కూడా గేమ్ చెంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తారని అందరు అనుకున్నారు. కానీ దీనికి సంబంధించి ఇంకా బ్యాలెన్స్ షూటింగ్ ఉండటం అందులోనూ డైరెక్టర్ శంకర్ అటు ఇండియన్ 2 సినిమాలో కూడా బిని గా ఉండటం వల్ల ఈ సంవత్సరం రామ్ చరణ్ థియేటర్లోకి రాలేకపోయాడు…
వెంకటేష్
వెంకటేష్ శైలేష్ కొలెన్ దర్శకత్వంలో చేస్తున్న సైంధవ్ సినిమా ఇప్పటివరకు మొత్తం షూటింగ్ పూర్తి చేసుకొని ఉంది అయినప్పటికీ ఇక ఈ సినిమా ఈ నెలలోనే రిలీజ్ కావాల్సింది కానీ సలార్ సినిమా వస్తూ ఉండటం తో సైంధవ సినిమా పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన అవసరమైతే ఏర్పడింది.
నాగార్జున
వరుసగా డిజాస్టర్ లను పొందుతున్న నాగార్జున ఈ సంవత్సరం ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తారని అందరూ అనుకున్నారు కానీ ఈ సంవత్సరం ఆయన ఒక సినిమాతో కూడా ప్రేక్షకులని పలకరించలేదు. అయితే వరుసగా ఫ్లాప్ లు వస్తున్న నేపథ్యంలో తను కొంచెం గ్యాప్ ఇచ్చి సినిమాలు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అందుకోసమే ఈ సంవత్సరంలో ఒక సినిమాను కూడా రిలీజ్ చేయకుండా ప్లాన్ చేసుకున్నట్టు గా తెలుస్తుంది…
ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్ ఈ సంవత్సరం దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తారని అందరూ అనుకున్నారు. కానీ దేవర సినిమాలో క్వాలిటీ అనేది బాగుండటం కోసం దాంట్లో పోస్ట్ ప్రొడక్షన్ కి సంబంధించి చాలా బాగా చేయాలనే ఉద్దేశ్యం తోనే దర్శకుడు కొరటాల శివ ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు గా తెలుస్తుంది. అందుకోసమే సినిమా రిలీజ్ అనేది లేట్ అవుతూ వస్తుంది.ఇక అందులో భాగంగానే 2023లో ఈ సినిమా రాలేకపోయింది…
అల్లు అర్జున్
అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న పుష్ప 2 సినిమా ఈ సంవత్సరం రిలీజ్ అవ్వాల్సింది కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా ని పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చిందంటు అప్పట్లో డైరెక్టర్ సుకుమార్ ఒక క్లారిటీ ఇచ్చాడు…