Prabhas : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంటున్నారు… ఇప్పటికే బాహుబలి (Bahubali) సినిమాతో భారీ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు చేస్తున్న సినిమాలతో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండటం విశేషం… మరి ఏది ఏమైనా కూడా ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతూ ఉండడం విశేషం…ఇక ఇలాంటి సందర్భంలోనే ప్రభాస్ సినిమాలో ఒక చిన్న పాత్ర అయిన సరే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అంటూ చాలామంది స్టార్ హీరోలు చెబుతూ ఉండటం విశేషం… ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన సూర్య అయితే ప్రభాస్ సినిమాలో నటించాలని ఉందని బాహుబలి సినిమా సమయం నుంచి చెబుతూనే ఉన్నాడు. కానీ దర్శక నిర్మాతలు ఆయనకు సరిపడా పాత్రని ప్రభాస్ సినిమాలో రాయలేకపోతున్నారు. ఆయన నటిస్తానన్నాడు కదా అని ఏదో ఒక చిన్న పాత్రను అతని చేత చేయించడం దర్శకులకు ఇష్టం లేదు. ఆయన చేయాలంటే ఒక పవర్ఫుల్ పాత్ర ఉండాలి. అలా అయితే బాగుంటుంది లేకపోతే మాత్రం ఆ పాత్రకి పెద్దగా ప్రాధాన్యత అయితే ఉండదనే ధోరణిలో మన దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారు…
ఇక రీసెంట్ గా మంచు విష్ణు (Vishnu) సైతం నేను ప్రభాస్ సినిమాలో నటిస్తాను అంటూ ‘స్పిరిట్ ‘ (Spirit) సినిమాలో నటించడం కోసం ఆ సినిమా యూనిట్ వాళ్లు నిర్వహించే ఆడిషన్స్ కి తను అటెండ్ అవుతానని ఫామ్ ను కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేశాడు. మరి మొత్తానికైతే మంచు విష్ణు చేస్తున్న ‘కన్నప్ప’ (Kannappa) సినిమాలో ప్రభాస్ కీలకమైన పాత్రలో నటించాడు. ఇక దాంతో ఈ సినిమా మీద భారీ బజ్ అయితే క్రియేట్ అవుతుంది.
దాంతో ఎలాగైనా సరే ఈ సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించి తను కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందాలనే ప్రయత్నంలో మంచు విష్ణు ఉన్నాడు. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
ఇక మంచు విష్ణు, ప్రభాస్ కి మధ్య మంచి సన్నిహిత సంబంధం ఉండడంతో ఒకరి సినిమాలో ఒకరు నటించడానికి సిద్ధంగా ఉంటున్నారు. కానీ ప్రభాస్ సినిమాలు మంచి విజయం సాధించడం వల్ల పెద్దగా ఒరిగేది అయితే ఏమి ఉండదని ప్రభాస్ అభిమానులు సైతం అభిప్రాయపడుతున్నారు…