సంక్రాంతినే నమ్ముకున్న స్టార్ హీరోలు !

ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒక్కరోజు రిలీజ్ అయితేనే సగం కలెక్షన్స్ పోతాయి. అలాంటిది ఇప్పుడు పెద్ద సినిమాలన్నీ ఒకేసారి రిలీజ్ అయితే.. సినిమా ఎంత బాగున్నా.. ఇక బాక్సాపీస్ వద్ద బకెట్ తన్నేయాల్సిందే. అందుకే సినిమా హిట్ ప్లాప్ అనేది సినిమా రిలీజ్ అయ్యే డేట్ ను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. కానీ కరోనా మహమ్మారి దెబ్బకు సినిమాల రిలీజ్ ల పరిస్థితి గందరగోళంలో పడింది. ఎప్పుడో సమ్మర్ లో రావాల్సిన సినిమాలే మొత్తం […]

Written By: admin, Updated On : August 16, 2020 10:17 am
Follow us on


ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒక్కరోజు రిలీజ్ అయితేనే సగం కలెక్షన్స్ పోతాయి. అలాంటిది ఇప్పుడు పెద్ద సినిమాలన్నీ ఒకేసారి రిలీజ్ అయితే.. సినిమా ఎంత బాగున్నా.. ఇక బాక్సాపీస్ వద్ద బకెట్ తన్నేయాల్సిందే. అందుకే సినిమా హిట్ ప్లాప్ అనేది సినిమా రిలీజ్ అయ్యే డేట్ ను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. కానీ కరోనా మహమ్మారి దెబ్బకు సినిమాల రిలీజ్ ల పరిస్థితి గందరగోళంలో పడింది. ఎప్పుడో సమ్మర్ లో రావాల్సిన సినిమాలే మొత్తం పోస్ట్ ఫోన్ అయ్యాయి. సరే.. సమ్మర్ సీజన్ పోతే మరో సీజన్ అనుకున్నారు.

Also Read: ‘మజిలీ – సమ్మోహనం’ కలయికలో చైతు !

సమ్మర్ తరువాత ముఖ్యమైన సీజన్ దసరానే. విజయదశమి సెలవుల్ని టార్గెట్ చేసుకుని స్టార్ హీరోల సినిమాలు ప్రతి సంవత్సరం పోటీకి సిద్దమవుతూ ఉంటాయి. కానీ కరోనా ప్రభావం ఇంకా తగ్గలేదు. సమ్మర్ లాగే దసరా కూడా సినిమాలకు దూరమయ్యేలా ఉంది. పోనీ కనీసం చిన్న సినిమాలను కూడా రిలీజ్ చేసుకునే సిట్యుయేషన్ థియేటర్లలో ఉండదు. డిజిటల్ రిలీజ్ లకు నిర్మాతలు నో చెబుతున్నారు. దాంతో దసరా సీజన్ కూడా కరోనా కోరల్లో చిక్కుకుపోయింది. కచ్చితంగా అక్టోబర్ నాటికి కరోనా ప్రభావం పూర్తిగా తగ్గేలా కనిపించడం లేదనేది కరోనా కేసులు చెబుతున్న వాస్తవం.

Also Read: స్వర్ణ ప్యాలెస్‌ ప్రమాదంపై హీరో రామ్‌ సంచలన వ్యాఖ్యలు!

దాంతో ఇప్పుడు అందరి చూపు సంక్రాంతి మీదే పడింది. అసలు సినిమాకి సంక్రాంతి సీజన్ గుండె లాంటిది. అప్పటిలోగా కరోనా తగ్గుతుందనే ఆశతో ఉన్నారు మేకర్స్. ఏది ఆయితే ఏం సంక్రాంతికి పోటీ రెట్టింపు అయ్యేలా ఉంది. సంక్రాంతికి భారీ చిత్రాలతో పాటు చిన్న సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. చిరు ‘ఆచార్య’, రజనీ ‘అన్నాత్తే’, యాష్ ‘కె.జి.ఎఫ్ 2’ ప్రభాస్ రాధే శ్యామ్ అలాగే కంగనా ‘తలైవి’, నితిన్ ‘రంగ్ దే’ వరుణ్ తేజ్ ‘బాక్సర్’, సూర్య మూవీ, విజయ్ మాస్టర్ మూవీ ఇంకా అప్పటికీ కొన్ని పెద్ద సినిమాలు కూడా రేసులోకి రావడం పక్కా. ఇవ్వన్నీ సంక్రాంతి సీజన్ ను మాత్రమే నమ్ముకుని ఉన్నాయి. ఒక హీరో మరో హీరో కోసం తన సినిమాని ఆపుకోవడానికి ఇది రెగ్యులర్ డేస్ కాదు కదా. ఖచ్చితంగా పోటీలో విడుదల చేస్తారు. అప్పుడు కలెక్షన్స్ సగానికి పడిపోతాయేమో.