Star Hero Rejects Sekhar Kammula: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ సినిమాలను చేస్తూ తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల (Shekar Kammula)… ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు చాలా తక్కువే అయినప్పటికి అందులో క్వాలిటీ ఉండే విధంగా చూసుకుంటాడు. ఈయన ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 సంవత్సరాల పైన అయినప్పటికి ఆయన ఎక్కడ కూడా వల్గారిటీ లేకుండా సినిమాలను చేసుకుంటూ మంచి సినిమాను ప్రేక్షకుడికి అందించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. మిగతా దర్శకులందరి కంటే ఆయన సినిమాలు చాలా సపరేట్ గా ఉంటాయి. అయితే ఇలాంటి శేఖర్ కమ్ముల ఇప్పటివరకు పెద్దగా స్టార్ హీరోలతో అయితే సినిమాలను చేయలేకపోయాడు. కారణం ఏంటంటే ఆయన ఎంచుకునే పాయింట్లు చిన్న సబ్జెక్టులు కాబట్టి వాటిని ప్రేక్షకుడికి కనెక్ట్ చేయాలంటే చిన్న హీరోలు అయితేనే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అందుకే ఆయన అలాంటి హీరోలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి ఒక స్టార్ హీరోని ఆయన తన కథతో ఇంప్రెస్ చేసినప్పటికి ఆ సినిమాలైతే పట్టాలెక్కలేదు.
‘గోదావరి’ (Godhavari) సినిమాని మహేష్ బాబు కోసం రాసుకున్నారట… ఆ కథను కూడా వినిపించారు… కానీ ఆయన ఆ కథను పెద్దగా ఇష్టపడకపోవడంతో ఆయన ఇమేజ్ కి తగ్గ కథ కాదని దాన్ని రిజెక్ట్ చేశారట. ఇక ఆ తర్వాత ఫిదా (Fidaa) సినిమా కథను కూడా మహేష్ బాబుకు వినిపించినట్టుగా శేఖర్ కమ్ముల ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.
ఇక ఈ సినిమాను మహేష్ బాబు (Mahesh Babu) కథ తన ఇమేజ్ కి సరిపోదనే ఉద్దేశ్యంతో ఆయన ఆ కథను రిజెక్ట్ చేసినట్టుగా శేఖర్ కమ్ముల అయితే తెలియజేశాడు…ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం కరోనా సమయంలో మహేష్ బాబుతో ఒక సినిమా ప్లాన్ చేయడానికి ప్రణాళిక రూపొందించుకున్నాడు. కానీ అది కూడా వర్కౌట్ కాలేదు. మొత్తానికైతే శేఖర్ కమ్ముల మూడుసార్లు చెప్పిన మూడు కథలు మహేష్ బాబుకు బాగా నచ్చాయి.
అయిన కూడా అవి తన ఇమేజ్ కి తగ్గట్టుగా లేవనే ఉద్దేశ్యంతోనే ఆయన ఆ కథలను రిజెక్ట్ చేసినట్టుగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి ఫ్యూచర్లో అయిన శేఖర్ కమ్ముల మహేష్ బాబు కాంబోలో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయా అనే ధోరణిలో కొంతమంది మహేష్ బాబు అభిమానులు సైతం కొన్ని కామెంట్స్ చేస్తూ ఉండడం విశేషం…