Star Hero : ఇతను నటించిన లేటెస్ట్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల సునామి సృష్టించింది అని తెలుస్తుంది. నార్త్ నుంచి సౌత్ సినిమా ఇండస్ట్రీ వరకు ఈ హీరో తన సత్తా చాటుతున్నాడు. కానీ స్టార్ హీరోగా ఎదగడానికి ముందు అతను చాలా కష్టాలను ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ఈ స్టార్ హీరో ఒకప్పుడు రెండుసార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. ఈ మధ్యకాలంలో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలను కూడా వెనక్కి నెట్టి పాన్ ఇండియా లెవెల్ లో బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఇతను నటించిన సినిమాలు అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈయన నటించిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టాయి. ఇతను బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్. విక్కీ కౌశల్ గురించి బాలీవుడ్ సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రజాదారణ పొందిన హీరోలలో ఇతను కూడా ఒకరు. కెరియర్ ప్రారంభంలో అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసిన విక్కీ కౌశల్ ఆ తర్వాత హీరోగా అవకాశాన్ని అందుకున్నాడు.
దర్శకుడు అనురాగ్ కశ్యప్ శిష్యుడిగా విక్కీ కౌశల్ కు గుర్తింపు ఉంది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన గ్యాంగ్స్ ఆఫ్ వస్సెపూర్ సినిమాతో విక్కీ కౌశల్ బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా పరిచయం అయ్యాడు. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి విక్కీ కౌశల్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ కూడా సినిమా గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత అతను నటనవైపు ఆసక్తి చూపించాడు. కెరియర్ ప్రారంభంలో సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో కనిపించాడు. ఆ తర్వాత మా సాంగ్ అనే సినిమాతో 2015లో హీరోగా మారాడు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత విక్కీ కౌశల్ ఉదం సింగ్, ఊరి సర్జికల్ స్ట్రైక్, మన్మరిజియాన్, సంజు వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
తన నటన టాలెంట్ తో ప్రేక్షకుల మనసులో స్థానం దక్కించుకున్నాడు. రీసెంట్గా విక్కీ కౌశల్ నటించిన చావా సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శంభాజీ మహారాజ్ జీవిత ఆధారంగా తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో విక్కీ కౌశల్ సరసన రష్మిక మందన నటించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించి దాదాపు 800 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. గతంలో దర్శకుడు అనురాగ్ కశ్యప్ విక్కీ కౌశల్ రెండుసార్లు జైలుకు వెళ్లాడని తెలిపారు. గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ సినిమా షూటింగ్ సమయంలో ఒక ప్రాంతంలో అనుమతి లేకుండా షూటింగ్ చేస్తున్న సమయంలో ఆ ప్రాంతం అక్రమ ఇసుక గని అని తెలిసింది. ఆ ప్రదేశంలో కాల్పులు జరిగిన సందర్భంగా విక్కీ కౌశల్ రెండుసార్లు జైలుకు వెళ్లాడని దర్శకుడు తెలిపారు.