Jayam Ravi-Kenisha : ఇటీవల కాలంలో సెలెబ్రిటీలు అత్యధిక శాతం విడాకులు తీసుకుంటున్న సంగతి మన అందరికీ తెలిసిందే. సజావుగా దాంపత్య జీవితం సాగిస్తున్న సెలెబ్రిటీలు చాలా అరుదుగా కనిపిస్తున్నారు. పెళ్ళైన రెండు మూడేళ్లకు విడిపోయినా, సరిగా అర్థం చేసుకోలేకపోయారు, అందుకే విడిపోయారేమో అని అనుకోవచ్చు. కానీ పెళ్ళై 15 ఏళ్ళు దాటి, ఎదిగిన పిల్లలు ఉన్న జంటలు కూడా ఈమధ్య విడాకులు తీసుకుంటున్నారు. ఇదే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. పాతికేళ్ళు దాంపత్య జీవితం గడిపిన ధనుష్, ఐశ్వర్య విడాకులు తీసుకోవడం పెద్ద సెన్సేషనల్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు రీసెంట్ గా ప్రముఖ తమిళ హీరో జయం రవి తన భార్య ఆర్తి రవి తో విడాకులు ప్రకటించడం పెద్ద సంచలనం గా మారింది. 15 ఏళ్లకు పైగా దాంపత్య జీవితం గడిపిన ఈ జంట, కోలీవుడ్ లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు.
అలాంటి జంట విడాకులు ప్రకటించడం, జయం రవి అభిమానులకు ఇప్పటికీ షాకే. అయితే ఆర్తి మాత్రం నా ప్రమేయం లేకుండానే నా భర్త విడాకులు ప్రకటించాడని, అతనితో మాట్లాడి సమస్య ని పరిష్కరించుకునేందుకు చాలా ప్రయత్నం చేసానని, కానీ నాకు ఆ అవకాశం ఇవ్వలేదంటూ ఆమె బాధపడుతూ ఒక లేఖ మీడియా కి విడుదల చేసింది. అయితే జయం రవి తన భార్యకు దూరంగా ఉండడానికి అసలు కారణం ప్రముఖ సింగర్ కేనీషా అంటూ సోషల్ మీడియా లో గత కొంతకాలం గా ప్రచారం అవుతున్న వార్త. ఈమె మోజులో పడి జయం రవి తన భార్యను దూరం పెట్టాడని, ఇది పూర్తిగా అన్యాయం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేసారు. దీనిపై జయం రవి నేడు స్పందించాడు.
ఆయన మాట్లాడుతూ ‘దయచేసి నా విడాకుల వ్యవహారం లో ఇతరుల పేర్లను లాగొద్దు. ఎవరి వ్యక్తిగత జీవితాలు వారికి ఉంటాయి. మీరు చేసే అసత్య ప్రచారాల కారణంగా వాళ్ళ జీవితాల్లో అలజడి రేగుతుంది. ఎన్నో కష్టాలను వాళ్ళు ఎదురుకోవాల్సి వస్తుంది. దయచేసి వ్యక్తిగత జీవితాలను గౌరవించడం నేర్చుకోండి. పలు మీడియా చానెల్స్ ప్రచారం చేసిన కథనాలను చూసాను. కేనీషా కి ఈ వ్యవహారం లో ఎలాంటి సంబంధం లేదు. 600 కు పైగా స్టేజి షోస్ చేస్తూ, ఆ అమ్మాయి ఎంతో కస్టపడి నేడు ఈ స్థాయి కి వచ్చింది. ఆమెని ఇలాంటి వివాదాల్లోకి లాగి సమస్య సృష్టించకండి’ అంటూ జయం రవి వ్యాఖ్యానించాడు. ఇన్ని రోజులు సోషల్ మీడియా ప్రచారం అవుతున్నప్పటికీ కూడా జయం రవి స్పందించకుండా, ఇప్పుడే స్పందించడానికి కారణం ఏమిటి?, అంటే ఈ రూమర్ ఆయన దృష్టికి రాలేదా వంటి సందేహాలు ప్రేక్షకుల్లో మెలుగుతున్నాయి. ఇదంతా పక్కన పెడితే జయం రవితో కలిసి బ్రతికేందుకు ఆయన భార్య ఆర్తి ఇప్పటికీ సిద్దంగానే ఉంది. జయం రవి విడాకుల పేపర్స్ మీద సంతకాలు పెట్టాడు కానీ, ఆర్తి ఇప్పటి వరకు పెట్టలేదట. మరి భవిష్యత్తులో వీళ్ళు కలుస్తారా లేదా అనేది చూడాలి.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read More