Homeఎంటర్టైన్మెంట్Hero Govinda : ఇంకో నటితో ఎఫైర్.. భార్యకు స్టార్ హీరో విడాకులు..? ఈ వార్త...

Hero Govinda : ఇంకో నటితో ఎఫైర్.. భార్యకు స్టార్ హీరో విడాకులు..? ఈ వార్త తెలిసి ఇండస్ట్రీ షాక్

Hero Govinda : బాలీవుడ్ లో విడాకులు ట్రెండ్ నడుస్తుంది. ఇప్పటికే హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ వంటి నటులు విడాకులు ప్రకటించారు. తాజాగా ఈ లిస్ట్ లో గోవిందా చేరాడని టాక్. భార్య సునీత అహుజాతో గోవింద్ విడిపోయాడంటూ కథనాలు వెలువడుతున్నాయి. కొన్నాళ్లుగా గోవిందా-సునీత విడివిడిగా ఉంటున్నారు. ఈ విషయాన్ని సునీత నేరుగా చెప్పారు. గోవిందాతో విడిగా సునీత ఎందుకు ఉంటున్నారు? వారి మధ్య మనస్పర్థలు తలెత్తాయా? అనే సందేహాలు నెలకొన్న వేళ.. నేషనల్ మీడియాలో విడాకులు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఒక మరాఠీ నటితో గోవిందా ఎఫైర్ కొనసాగిస్తున్నారట. ఇది నచ్చని భార్య సునీత విడిపోయారని, ఆయన నుండి విడాకులు తీసుకుందని కథనాల సారాంశం. గోవిందా-సునీత విడాకుల వార్త పరిశ్రమలో హాట్ టాపిక్ గా ఉంది. సునీతను గోవిందా 1987లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం. ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు. మూడున్నర దశాబ్దాల వైవాహిక బంధానికి వీరు ముగింపు పలికారని తెలుస్తుంది.

90లలో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగాడు గోవింద. ఆయన డాన్సులకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. అమ్మాయిల రాకుమారుడు ఆయన. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు లేడీ ఫాలోయింగ్ బీభత్సంగా ఉండేది. గోవిందా 130కి పైగా సినిమాల్లో నటించారు. కమెడియన్ గా కూడా ఆయన ట్రెండ్ సెట్ చేశారు. 1986లో లవ్ 86 మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు. మొదటి చిత్రం లవ్ 86 తో హిట్ కొట్టాడు. జాన్ సే ప్యారా, దుల్లారా, కుద్దర్, ఆందోళన్ చిత్రాలు గోవిందాకు ఫేమ్ తెచ్చిపెట్టాయి.

గత ఏడాది గోవిందా ప్రమాదానికి గురయ్యాడు. తన లైసెన్స్డ్ రివాల్వర్ మిస్ ఫైర్ కావడంతో కాలిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఆయన్ని వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం గోవిందా కోలుకున్నాడు. 2019లో విడుదలైన రంగీలా రాజా చిత్రం అనంతరం గోవిందా సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు.

Exit mobile version