Homeఎంటర్టైన్మెంట్Star Directors Missed Opportunities Tollywood: వచ్చిన అవకాశాన్ని వాడకోలేకపోయిన స్టార్ డైరెక్టర్స్...

Star Directors Missed Opportunities Tollywood: వచ్చిన అవకాశాన్ని వాడకోలేకపోయిన స్టార్ డైరెక్టర్స్…

Star Directors Missed Opportunities Tollywood: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలను డైరెక్ట్ చేయడం అనేది ప్రతి దర్శకుడి కల…ఆ కళ ను నెరవేర్చుకోవడానికి కొన్నిసార్లు అవకాశాలు వచ్చిన కూడా ఆ దర్శకులు తమ సత్తాను చాటుకోలేక డీలా పడిపోతున్నారు. కారణం ఏంటి అంటే వాళ్ళు రాసుకున్న కథ మీద క్లారిటీ లేకపోవడం దానిని ప్రేక్షకులు మెచ్చే విధంగా తెరమీద ఆవిష్కరించకపోవడం వల్లే ఇలాంటి మిస్టేక్ లైతే జరుగుతున్నాయంటూ హీరోల అభిమానులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రస్తుతం మారుతి లాంటి దర్శకుడికి ప్రభాస్ పిలిచి మరి ‘రాజాసాబ్’ సినిమా చేసే అవకాశాన్ని ఇచ్చాడు. కానీ ఆయన దానిని పూర్తిస్థాయిలో వాడుకోలేదు. కారణం ఏంటి అంటే పూర్తి కమర్షియల్ సినిమా చేసిన బాగుండేది. కానీ హర్రర్ సినిమా అంటూ ప్రభాస్ ను పెట్టి అతని ఇమేజ్ ను డామేజ్ చేసే విధంగా సన్నివేశాలు రాసుకొని ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోవడం వల్ల ఆ సినిమా భారీగా డిజాస్టర్ అయింది.

Also Read: ఏంటి ఈ బౌలింగ్ తో ఐపీఎల్ ట్రోఫీ గెలుస్తారా.. బ్యాగులు సర్దుకుని ఇంటికి వచ్చేయండి

దాంతో మారుతి పేరు చెడిపోయింది. ఇక హరీష్ శంకర్ లాంటి దర్శకుడు సైతం పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చేసే అవకాశం వచ్చిన కూడా ఆయన పూర్తిస్థాయిలో వాడుకోలేకపోయాడు. దానివల్ల అతని ఇమేజ్ కూడా చాలా వరకు డ్యామేజ్ అయింది…

ఇక చిరంజీవితో ‘భోళా శంకర్’ లాంటి సినిమా చేసే అవకాశం వచ్చిన మెహర్ రమేష్ సైతం ఆ సినిమాని సూపర్ హిట్ సినిమాగా నిలుపలేకపోయాడు. కారణం ఏదైనా కూడా వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో పూర్తి క్లారిటితో ఉన్నప్పుడే వాళ్లకు సక్సెసులైతే వస్తాయి. అలా కాకుండా ఏదో ఇమేజ్ కోసం పోయి స్టార్ హీరోల నుంచి ఆఫర్లు వచ్చాయని సినిమాలు చేస్తే వాళ్ళ ఇమేజ్ ను దెబ్బ తీసుకోవడమే కాకుండా స్టార్ హీరోలకు సైతం భారీ డిజాస్టర్లను కట్టబెట్టినవారు అవుతారు…

ఇక ప్రస్తుతం స్టార్ హీరోలు సైతం ఎవరిని నమ్మాలి. ఎవరిని నమ్మకూడదో అర్థం కానీ పరిస్థితిలో ఉన్నారు. కొంతమంది మంచి కథతో వచ్చినప్పటికి వారు స్క్రీన్ మీద దానిని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నారు. కాబట్టి వాళ్లకు భారీ ఫ్లాప్ లు వస్తున్నాయంటూ వాళ్ళు అభిప్రాయపడుతున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular